TDP: అనంతపురం టీడీపీ నేతల మధ్య గ్రూప్ రాజకీయాలు.. హై కమాండ్ విచారణ
ABN , Publish Date - Aug 19 , 2025 | 07:12 PM
అనంతపురం అర్బన్ పంచాయతీపై తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ హై కమాండ్ చర్చించింది. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలోని కమిటీ వద్ద అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హాజరై వివరణ ఇచ్చారు.
అమరావతి, ఆగస్టు19 (ఆంధ్రజ్యోతి): అనంతపురం అర్బన్ పంచాయతీపై (Anantapur Urban Politics) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ హై కమాండ్ చర్చించింది. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) నేతృత్వంలోని కమిటీ వద్ద అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హాజరై వివరణ ఇచ్చారు. అయితే, కమిటీ వద్దకు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ రాలేదు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్నప్పుడు రావాలని ఎమ్మెల్యేకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.
గ్రూపు రాజకీయాలు చేయను: ప్రభాకర్ చౌదరి
ఈ సందర్భంగా అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మీడియాతో మాట్లాడారు. అనంతపురం పరిణామాలపై పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసి అడిగితే స్వయంగా కలుస్తానని చెప్పడంతో టీడీపీ కార్యాలయానికి రమ్మనడంతో వచ్చానని తెలిపారు. టీడీపీకి, ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు బాధ్యతగా స్పందించిన తీరు అధిష్టానానికి వివరించానని అన్నారు. తాను సీటు వదులుకున్నానని, తనకు గ్రూపులతో పనేంటని ప్రశ్నించారు. భవిష్యత్తులో పోటీచేసే ఆలోచన కూడా లేనప్పుడు గ్రూపు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజలు తన వద్దకు సమస్యలతో వచ్చినప్పుడు వాటి పరిష్కారానికి తన వంతు బాధ్యతగా స్పందిస్తున్నానని ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీకి బిగ్ షాక్... కీలక నేతపై కేసు
నన్ను చంపేందుకు వైసీపీ నేత ప్లాన్ చేశారు: కావ్యా కృష్ణారెడ్డి
Read Latest AP News and National News