YSRCP: వైసీపీకి బిగ్ షాక్... కీలక నేతపై కేసు
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:45 PM
పొన్నూరు వైసీపీ ఇన్‌చార్జ్ అంబటి మురళిపై చేబ్రోలు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అమరావతి వల్లే పొన్నూరు పొలాలు మునిగాయని అంబటి మురళి అసత్య ప్రచారం చేశారని అప్పాపురం కాలువ ఏఈఈ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు చేబ్రోలు పీఎస్‌లో కేసు నమోదైంది.
గుంటూరు జిల్లా, ఆగస్టు19 (ఆంధ్రజ్యోతి): పొన్నూరు వైసీపీ ఇన్‌చార్జ్ అంబటి మురళిపై (YSRCP incharge Ambati Murali) చేబ్రోలు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అమరావతి వల్లే పొన్నూరు పొలాలు మునిగాయని అంబటి మురళి అసత్య ప్రచారం చేశారని అప్పాపురం కాలువ ఏఈఈ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు చేబ్రోలు పీఎస్‌లో కేసు నమోదైంది. విపత్తుల పేరుతో రైతులను భయభ్రాంతులకు గురిచేశారని ఏఈఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంబటి మురళితోపాటు సాక్షి ఛానల్‌పైనా కేసు నమోదు చేశారు.
మురళికి పోలీసులు నోటీసులు..
పొన్నూరు వైసీపీ ఇన్‌చార్జి అంబటి మురళికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. 41ఏ నోటీసులు జారీ చేశారు తాడేపల్లి పోలీసులు. ఈ నెల 21వ తేదీ లేదా 22 తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. రాజధాని అమరావతి వరదను మళ్లించి పొన్నూరు నియోజకవర్గంలో పొలాలు ముంచారని అంబటి ఆరోపణలు చేశారు. నీటి పారుదల శాఖ అధికారుల ఫిర్యాదుతో అంబటి మురళిపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నందమూరి వారి ఇంట విషాదం.. హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. కరెంట్ షాక్తో ఇద్దరు మృతి
Read Latest AP News and National News