Chandrababu Meets Radhakrishnan: రాధాకృష్ణన్.. దేశానికి , ఉపరాష్ట్రపతి పదవికి గౌరవం తెస్తారు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 22 , 2025 | 05:33 PM
సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి కుర్చీకి ప్రతిష్ట పెంచుతారని.. అలాంటి వ్యక్తికి మద్దతు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని, తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు నుంచి ఎన్డీఏ కూటమితో పొత్తులో ఉందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
ఢిల్లీ, ఆగస్టు22(ఆంధ్రజ్యోతి): ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను (CP Radhakrishnan) మర్యాదపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఇవాళ(శుక్రవారం) ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కలిసి సీపీ రాధాకృష్ణన్‌ను ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాయని క్లారిటీ ఇచ్చారు. రాధాకృష్ణన్‌తో ఎప్పటి నుంచో తనకు పరిచయం ఉందని గుర్తుచేసుకున్నారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి తన మద్దతును తెలియజేశానని పేర్కొన్నారు. దేశంలో గౌరవించ దగ్గ వ్యక్తి, అత్యున్నత స్థానానికి మంచి అభ్యర్థి, దేశానికి గౌరవం తీసుకొస్తారని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు.
సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి కుర్చీకి ప్రతిష్ట పెంచుతారని.. అలాంటి వ్యక్తికి మద్దతు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని, తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు నుంచి ఎన్డీఏ కూటమితో పొత్తులో ఉందని ఉద్ఘాటించారు. ఒకసారి ఎన్డీఏ అభ్యర్థి పెట్టిన తర్వాత ఓడిపోతామనే తెలిసి ఇండియా కూటమి మళ్లీ అభ్యర్థిని పెట్టడం ఎందుకు? అని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు.
గెలిచే అవకాశం లేకపోయినా అభ్యర్థిని పెట్టి ఇండియా కూటమి రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఎన్డీఏలో ఉన్నపుడు ప్రతిపక్ష అభ్యర్థికి ఎలా మద్దతు ఇస్తామని ప్రశ్నించారు. గతంలో పీవీ నరసింహారావుకు నాటి సందర్భంలో తెలుగువారు అనే ఉద్దేశంతో కాంగ్రెస్‌లో ఉన్న తెలుగుదేశం మద్దతు తెలిపిందని స్పష్టం చేశారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఎన్డీఏ కూటములేనని.. అలాంటి సందర్భంలో మద్దతు ఆశించడం , మాట్లాడటం సరికాదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
హిందూ ధర్మంపై విషం చిమ్ముతున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ఆనం ధ్వజం
Read Latest AP News And Telugu News