Home » Telangana
పెళ్లి పేరుతో ఓ ఎంబీబీఎస్ విద్యార్థినిని మోసం చేసిన యువకుడిని తిరుపతి జిల్లా అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలికి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువకుడు.. ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. ఆపై యువతి పెళ్లి పేరు ఎత్తగానే మతం మారాలంటూ ప్రైవేటు ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు దిగాడు.
ఆటో కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆటో ఛార్జీలను పెంచుతూ జీవో విడుదల చేసింది. ఇంధనం, మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ ఖర్చుల పెరుగుదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఖైరతాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌దే విజయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సిట్టింగ్ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చనిపోయినా సింపతీ లేకుండా కాంగ్రెస్ పార్టీనే గెలిచిందని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రో సేవలకు కామన్ పాస్ అందుబాటులోకి వచ్చింది. ప్రజాభవన్‌లో మెట్రో - ఆర్టీసీ కామన్ పాస్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు.
బీఆర్ఎస్ సభతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెమటలు పట్టిస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. త్వరలోనే కొడంగల్‌లో బీఆర్ఎస్ సభను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు ఈరోజు జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. సీఎం సమక్షంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ కోసం హరే కృష్ణ ఫౌండేషన్‌తో జున్నా సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది.
హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రో ఉమ్మడి కామన్ ట్రావెల్ పాస్ నేటి నుంచి అందుబాటులోకి వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అన్ని మెట్రో స్టేషన్లలో ఈ పాస్ జారీ చేస్తారని వెల్లడించారు. ORR పరిధిలోని సిటీ బస్సులు, మెట్రోలో ప్రయాణించవచ్చని చెప్పుకొచ్చారు.
రెండు డీఏల విడుదలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై టీఎన్జీవోలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. వివరాల్లోకి వెళితే..
ఎల్‌నినో ప్రభావం క్రమంగా కరీంనగర్ జిల్లాపై పడుతోంది. ఊహకందని విధంగా సెప్టెంబరు చివరి వారంలో ఎండ తీవ్రత విపరీతంగా పెరిగింది.
రోడ్డు ప్రమాదంలో ఎందరో ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి సరైన సమయంలో వైద్యం అందితే ప్రాణాలు కాపాడవచ్చు.