Share News

రాజకీయాల్లో ఉండాలా? వద్దా?

ABN , Publish Date - Feb 18 , 2026 | 06:35 AM

తొర్రూరు మునిసిపాలిటీ చైర్మన్‌ పదవి కాంగ్రెస్‌కు దక్కడంతో బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కంటతడి పెట్టారు.

రాజకీయాల్లో ఉండాలా? వద్దా?

  • మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కంటతడి

నర్సింహులపేట (మహబూబాబాద్‌ క్రైం), ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): తొర్రూరు మునిసిపాలిటీ చైర్మన్‌ పదవి కాంగ్రె్‌సకు దక్కడంతో బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కంటతడి పెట్టారు. ఈ ఎన్నిక నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా ఎర్రబెల్లిని పోలీసులు అరెస్టు చేసి నర్సింహులపేట ఠాణాకు తరలించారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక పూర్తయిన అనంతరం విడుదల చేసే క్రమంలో పోలీస్ స్టేషన్ గేటు లోపలి నుంచి దయాకర్‌రావు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం దుర్మార్గపు రాజకీయాలు చేస్తోందని, ఇలాంటి రాజకీయాల్లో ఉండాలా? తప్పుకోవాలా? అని వాపోయారు. బీఆర్‌ఎ్‌సకు స్పష్టమైన మెజారిటీ వచ్చినా.. చైర్మన్‌ పదవిని కాంగ్రెస్‌ హస్తగతం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. రాత్రింబవళ్లు కష్టపడిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు తాను ఏం సమాధానం చెప్పాలని భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు.. తొర్రూరు మునిసిపాలిటీ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా ఉన్న ఎమ్మెల్సీ మధుసూదనాచారిని అక్కడికి వెళ్లకుండా హనుమకొండలోని ఆయన నివాసంలో సుబేదారి పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.

Updated Date - Feb 18 , 2026 | 06:36 AM