Share News

కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Feb 18 , 2026 | 06:46 AM

బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు

ఇంటర్నెట్ డెస్క్: బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ మేరకు మంగళవారంనాడు ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. కేసీఆర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Updated Date - Feb 18 , 2026 | 06:47 AM