ఏసీ ఉష్ణోగ్రత 25 కన్నా తక్కువ వద్దు
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:44 AM
వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం.. ఈ నెల 19 నుంచి ఉక్కపోత పెరిగే అవకాశం ఉండటంతో...
ప్రభుత్వ కార్యాలయాలకు ఆదేశాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం.. ఈ నెల 19 నుంచి ఉక్కపోత పెరిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎయిర్ కండీషనర్(ఏసీ)ల వినియోగం మొదలైంది. ఈ నేపథ్యంలో ఏసీలను 25 డిగ్రీల వద్దే వాడాలని, అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రతతో వినియోగించడానికి వీల్లేదని సర్కారు స్పష్టం చేసింది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ)-2018లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఏసీ వినియోగం కచ్చితంగా నిర్దిష్ట ఉష్ణోగ్రతల వద్ద ఉండాలని పేర్కొంది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ జీవో జారీ చేశారు.