Home » Telangana
కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లై ఓవర్ల నిర్మాణంపై జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే విధానాన్ని శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించింది.
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారంటూ వృద్ధుడిని బెదిరించి.. లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. షేట్‌బషీర్‌బాద్‌కు చెందిన 72 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసం చేశారు.
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఒకే ప్రాపర్టీ ఐడీ, ఒకే బిల్లు విధానం అమల్లోకి వచ్చింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్లీ ప్రత్యేకంగా అప్లై చేసుకోకుండానే ఆటోమేటిక్‌గా మ్యూటేషన్ జరగనుంది.
పెద్దపల్లి ప్రభు త్వ జూనియర్ కళాశాల కాంప్లెక్స్‌లో దుకాణాలు నిర్వ హిస్తున్న 26 మంది షాపు యజమానులకు వారి సొంత పేర్లపై అగ్రిమెంట్లు చేయించడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్‌లో జిల్లా స్థాయి అండర్ 11, 14 బాలురు, బాలికల 70వ ఎస్‌జిఎఫ్ కరాటే సెలక్షన్స్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకత పాటించాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు. అర్హత కలిగిన నిరుపేద కుటుంబాలకు పథకం ప్రయోజనం అందేలా ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు బాధ్యతతో వ్యవహరించా లని అన్నారు.
గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్సీ, బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ మల్క కొము రయ్య డిమాండ్ చేశారు. ఆదివారం పెద్దపల్లి పట్టణంలోని మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శిం చారు.
పెళ్లిళ్లు, శుభ కార్యాల సందడి నడుమ విందు భోజనాల్లో విస్త్రతం గా వాడుతున్న ప్లాస్టిక్, పేపర్ ప్లేట్లు, గ్లాసులు ఆరోగ్యానికి నిశ్శబ్ధ ముప్పుగా మారుతున్నాయి. కాలంతో పాటు పరుగులు పెడుతున్న ప్రస్తుత పరిస్థి తుల్లో అంతా తాత్కాలికమైంది. పెళ్లిళ్లు, అన్నదానాలు, విహార యాత్రలు, ఇలా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వస్తువులే కనిపిస్తున్నాయి.
పట్టాదారు రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఫార్మ ర్ రిజిస్ట్రేషన్‌లో భాగంగా ప్రఈ రైతు రిజిస్ట్రేషన్ /ఫార్మర్ ఐడీ సమకూరుస్తున్నారు. ఒక రైతు ‘ఒక గుర్తింపు-సమగ్ర సేవలు‘ లక్ష్యంగా అన్నదాతల వివరాలను డిజిటల్‌గా నమోదు చేస్తున్నారు
ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీఆర్టీటీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆడె ప్రకాష్ డిమాండ్ చేశారు. స్థానికంగా ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యా యులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. అక్రమ వర్క్ అడ్జస్ట్‌మెంట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.