Share News

దేవతల కాలంలోనే మహిళలకు అత్యున్నత స్థానం: చిన జీయర్ స్వామి

ABN , Publish Date - Feb 20 , 2026 | 07:04 PM

దేవతల కాలంలోనే మహిళలకు అత్యున్నత స్థానం ఇచ్చారని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పద్మభూషణ్ త్రిదండి చిన్నజీయర్ స్వామి వ్యాఖ్యానించారు. మహిళా సాధికారత కోసం ఇప్పుడు వనితలు కొట్లాడుతున్నారని పేర్కొన్నారు..

దేవతల కాలంలోనే మహిళలకు అత్యున్నత స్థానం: చిన జీయర్ స్వామి
Chinnajiyar Swamy

సిద్దిపేట, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): దేవతల కాలంలోనే మహిళలకు అత్యున్నత స్థానం ఇచ్చారని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పద్మభూషణ్ త్రిదండి చినజీయర్ స్వామి (Chinnajiyar Swamy) వ్యాఖ్యానించారు. మహిళా సాధికారత కోసం ఇప్పుడు వనితలు కోట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇవాళ(శుక్రవారం) సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం మల్లారంలో చిన్నజీయర్ స్వామి పర్యటించి, పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడారు.


స్త్రీలకి మంత్రం చెప్పే వారు కాదు..

రామానుజాచార్యుల కంటే ముందు కాలంలో స్త్రీలకి మంత్రం చెప్పే వారు కాదని.. ఆ కాలంలో వనితలు మంత్రం వింటే చెవిలో సీసం పోయాలని, మంత్రం పటిస్తే నాలుక కోసేయాలని అనే వారని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. రామానుజాచార్యులు వచ్చాక.. మహిళల పట్ల అలా ప్రవర్తించడం తప్పు అని చెప్పారని.. అంతటి భగవంతుడే మహిళలకు ఉన్నత స్థానం ఇచ్చారని.. అలాంటిది మనం అడ్డుకోవడం తప్పు అవుతుందని ఆయన పేర్కొన్నారు.


రజాకార్ల రోజులు మళ్లీ రాకూడదు: చిన్నజీయర్ స్వామి

చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. ‘మగవారికి ఎంత అధికారం ఉంటుందో.. మహిళలకు అంతకంటే ఎక్కువే ఉంటుందని రామానుజాచార్యులు అన్నారు. అందుకే రామానుజాచార్యులు స్గ్రీలను సమతా మూర్తి అంటారు. మన జీవితాలతో పాటు మన ధర్మం కూడా ఒక భాగం కావాలి. మన గురువులు చేసే ధార్మిక కార్యాలకు మనం తోడ్పడాలి. మన తర్వాత తరాలు, వారి ఆరోగ్యాలు బాగుండాలంటే మన సమయాన్ని, కొంత సంపదను.. ధర్మానికి కేటాయించాలి. పాత రోజులు, రజాకార్ల వంటి రోజులు మళ్లీ రాకూడదు.. అలా రాకూడదంటే మన సమాజం చైతన్యం కావాలి’ అని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైరిటేజ్.. నాణ్యతలో రాజీ పడబోం: నారా భువనేశ్వరి

యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 20 , 2026 | 07:18 PM