Home » Telangana
పల్లె ఎన్నికలు జోరందుకున్నాయి. సిరిసిల్ల జిల్లాలో తొలి విడతలో ఐదు మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల పర్వం ముగిసి పోయింది. ఉపసంహారణలు, ఏకగ్రీవాల కోసం ఒకవైపు మంతనాలు జరుగుతుండగా మరోవైపు ప్రచారంలోకి అభ్య ర్థులు ఆడుగుపెడుతున్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఇప్పుడిప్పుడే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానా లకు పోటీ చేసే అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొన్నది. బీసీలు, జనరల్‌కు కేటాయించిన సర్పంచ్ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉన్నది.
ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యులకు, వైద్య సిబ్బందికి సూచించారు. శనివారం గోదావరిఖని ప్రభు త్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల మను గడ ప్రశ్నార్థకమవుతోందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, తెలం గాణ విద్యాపరిరక్షణ కమిటీ రాష్ట్ర ఆర్గనై జింగ్ సెక్రెటరీ డాక్టర్ లక్ష్మీనారాయణ, రఘుశంకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతీ రైతుకు అవసరమైన యూరియా అందేలా పక్కా ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. శనివారం బ్రాహ్మణపల్లి రైతువేదిక వద్ద యూరియా అమ్మకాల పర్యవేక్షణ యాప్‌పై ఎరువుల డీలర్లకు నిర్వహించిన శిక్షణలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.
రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ చరిత్ర ఉంటుందని, ఉద్య మకారులపై గన్ ఎక్కు పెట్టిన చరిత్ర సీఎం రేవంత్ రెడ్డిదని, ఉద్యమంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఎక్కడ ఉన్నాడోనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. శనివారం పెద్దపల్లిలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కాంగ్రెస్, బీజేపీ కూటమిల దోపిడీ పెత్తందార్ల కబందహస్తాల నుంచి తెలంగాణ తల్లిని విడిపించాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. దీక్షా దివాస్ భాగంగా జిలాల్లో కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి ముఖ్య అతిథిగా ప్రవీణ్‌కుమార్ హాజరయ్యారు.
గ్రామంలో ఏ సమస్య ఉన్నా ముందుగా గుర్తొచ్చేది సర్పంచే. అధికారి వచ్చినా, ఇంకెవరైనా వచ్చినా ముందు ఆయనను కలవాల్సిందే. అలాంటి గొప్ప స్థానంలో ఉండాల్సిన వ్యక్తి పూర్తిగా ప్రజల సంక్షేమం కోరేవారై ఉండాలి. ప్రభుత్వ పథకాల అమలులో, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడంలోను ఆయన పాత్రే కీలకం. ఈ నేపథ్యంలో మంచి సర్పంచ్‌ను ఎన్నుకోవడంలో పలు మార్లు ఆలోచించుకోవాలి.
ప్రీప్రైమరీ పాఠశాలలను సమర్థవంతంగా నిర్వహించి ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించి శిక్షణ ముగింపు కార్యక్రమంలో శనివారం కలెక్టర్ మాట్లాడారు.
సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మార్గ దర్శకాలను సమర్థవతంగా అమలు యేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సిర్పూర్(టి) మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం నిర్వహించిన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లాతో కలిసి హాజరయ్యారు.