ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు
ABN , Publish Date - Feb 18 , 2026 | 04:46 AM
పైరసీ ఆరోపణలతో గతేడాది నవంబర్‌లో అరెస్టయిన ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
హైదరాబాద్ విడిచి వెళ్లరాదని షరతు
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): పైరసీ ఆరోపణలతో గతేడాది నవంబర్‌లో అరెస్టయిన ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని, సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి చర్యలకు పాల్పడరాదని, వ్యక్తిగత బాండ్, పూచీకత్తులు సమర్పించాలని పేర్కొంటూ పలు షరతులు విధించింది. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ (సీసీఎస్)లో హాజరుకావాలని ఆదేశించింది. పైరసీ ఆరోపణలతో పోలీసులు నమోదు చేసిన కేసుల్లో దర్యాప్తు పూర్తయిందని, ఇంకా తనను జైల్లో ఉంచడం చట్టవ్యతిరేకమని పేర్కొంటూ రవి హైకోర్టులో వేర్వేరుగా నాలుగు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన జస్టిస్ కే సుజన ధర్మాసనం అనుకూలంగా తీర్పు ఇచ్చింది.