Home » Telangana
రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు మాని రైతులు పడుతున్న కష్టాలను తీర్చాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఎన్‌టిపిసిలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు సాగునీరు, విద్యుత్ అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
సిర్పూరు నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వచ్చే రోజుల్లో పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయా లనే లక్ష్యంతో ముందస్తు చర్యలు చేపడుతు న్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఆహార పదార్థాల్లో కల్తీని అరికట్టేందుకు అధికారులు తనిఖీలు చేపట్టి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి ఆహార భద్రత సలహా కమిటీ సమావేశానికి అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని హోటళ్లు, బేకరీలు, గురుకుల పాఠశాలలు,
జిల్లాలో రహదారి ప్రమాదాలు జరుగకుండా ముందస్తూ రక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి రహదారి భద్రత, ప్రమాదాల నివారణపై సంబంధితశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో 47 వేల ఎకరాలలో వరి పంట సాగు చేయగా 23,900 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశిచుకున్నారు. త్వరలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే అవకాశం ఉంది. కేంద్రాల ప్రారంబానికి క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయా లని కలెక్టర్ హరిత, .అదనపు కలెక్టర్ డేవిడ్‌లు పలుమార్లు సంబందిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా మునుపటి ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. 'దమ్ముంటే మీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి' అన్నారు. 'హైటెక్ సిటీ పక్కన స్టార్ హోటళ్లు మీ పేరు మీద లేవని చెప్పగలరా? ఉన్నాయని నేను నిరూపిస్తా.. లేకుంటే పేరు మార్చుకుంటా' అని సీఎం రేవంత్ శపథం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (బుధవారం) సిరిసిల్లలో పర్యటనలో భాగంగా భారీ ర్యాలీలో పాల్గొన్నారు.
పేదలకు సంక్షేమ పథకాలు అందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి.. కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు.