Share News

kumaram bheem asifabad- సేవాలాల్‌ చూపిన మార్గం అనుసరించాలి

ABN , Publish Date - Feb 17 , 2026 | 10:17 PM

సంత్‌ సేవాలాల్‌ చూపిన మార్గం ప్రతి ఒక్కరూ అనుసరించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం గిరిజన సంక్షేమశాఖ, సేవాలాల్‌ జయంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన సద్గురు సంత్‌ సేవాలాల్‌ జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే కోవమ లక్ష్మి, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బోగ్‌ బండార్‌ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు

kumaram bheem asifabad- సేవాలాల్‌ చూపిన మార్గం అనుసరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత

ఆసిఫాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): సంత్‌ సేవాలాల్‌ చూపిన మార్గం ప్రతి ఒక్కరూ అనుసరించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం గిరిజన సంక్షేమశాఖ, సేవాలాల్‌ జయంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన సద్గురు సంత్‌ సేవాలాల్‌ జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే కోవమ లక్ష్మి, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బోగ్‌ బండార్‌ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సంత్‌ సేవాలాల్‌ చూపిన మార్గంలో నడవలన్నారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ అని, బంజార సమాజాభివృద్దికి విశేష కృషి చేశారన్నారు. బారతీయ సామాజిక సంఘ సంస్కర్తగా ప్రసిద్ది చెందారని తెలిపారు. ఆయన స్ఫూర్తితో దేశ అభివృద్దికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంలో బంజార భవన్‌, సేవాలాల్‌ విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ గతంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అదికారికంగా సేవాలాల్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకొవడానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. హైదరాబాద్‌ బంజారహి ల్స్‌లో కుమరంభీం, బంజార భవన్‌లను నిర్మించడం జరిగిందన్నారు. అంతకు ముందు పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు గుణవంత్‌రావు, ప్రదాన కార్యదర్శి రూప్‌లాల్‌ నాయక్‌, గౌరవ అధ్యక్షులు శంకర్‌నాయక్‌, రవినాయక్‌, శివప్రసాద్‌, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీ శ్యాంనాయక్‌, మాజీ జడ్పీ ఛైర్మన్‌ రాథోడ్‌ జనార్థన్‌, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ మంగ, గిరిజన సంక్షేమ జిల్లా అధికారి రమదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2026 | 10:17 PM