kumaram bheem asifabad- రేషన్ దుకాణం బహుదూరం
ABN , Publish Date - Feb 17 , 2026 | 10:21 PM
రేషన్ దుకాణాలు బహుదూరం ఉండడంతో అబ్ధిదారు లు ఇబ్బందులు పడుతున్నారు. నెలనెలా దుకాణాలకు వెళ్లి రేషన్ బియ్యం తంటాలు పడుతున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం గత ప్రభుత్వం నూతన పంచాయతీ లను ఏర్పాటు చేసింది. తండాలు సైతం పంచాయతీలు గా ఆవిర్భవించాయి. చింతలమానేపల్లి మండలంలో 12 గ్రామ పంచాయతీలుండగా మరో ఏడు జీపీలను కొత్తగా ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం 19కి చేరిం ది. కొత్త గ్రామ పంచాయతీల్లో రేషన్ దుకాణాలు మంజూ రు కాకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలకు రేషన్ సరకుల కోసం దూర భారం తప్ప డం లేదు.
- వ్యయ ప్రయాసలతో వృద్ధుల ఇబ్బందులు
- కొత్త పంచాయతీల ప్రజలకు తప్పని అవస్థలు
చింతలమానేపల్లి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): రేషన్ దుకాణాలు బహుదూరం ఉండడంతో అబ్ధిదారు లు ఇబ్బందులు పడుతున్నారు. నెలనెలా దుకాణాలకు వెళ్లి రేషన్ బియ్యం తంటాలు పడుతున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం గత ప్రభుత్వం నూతన పంచాయతీ లను ఏర్పాటు చేసింది. తండాలు సైతం పంచాయతీలు గా ఆవిర్భవించాయి. చింతలమానేపల్లి మండలంలో 12 గ్రామ పంచాయతీలుండగా మరో ఏడు జీపీలను కొత్తగా ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం 19కి చేరిం ది. కొత్త గ్రామ పంచాయతీల్లో రేషన్ దుకాణాలు మంజూ రు కాకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలకు రేషన్ సరకుల కోసం దూర భారం తప్ప డం లేదు. ప్రతి నెలా సుమారు ఐదు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలోని దుకాణాల్లో నుంచి సరకు లను తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
- మండలంలో 17 రేషన్ దుకాణాలు..
మండలంలో మొత్తం17 రేషన్ దుకాణాలుండగా, ఇందులో మొత్తం 9,979 రేషన్ కార్డులున్నాయి. కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులం దరికీ కొత్తగా రేషన్ కార్డులను మంజూరు చేయడంతో రేషన్ కార్డులు జారీ అయ్యాయి. అయితే నూతన పంచాయతీల్లో రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయకపోవ డంతో పాత గ్రామ పంచాయతీల్లో నుండే రేషన్ సరకులను తెచ్చుకుంటున్నారు. రేషన్ సరకుల కోసం ఆటోలు కిరాయికి మాట్లాడుకుంటే అదనపు ఖర్చు అవుతోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త జీపీల్లో దుకాణాలు ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
- సాంకేతిక సమస్యే కారణం..
కొత్తగా ఏర్పాటైన పంచాయతీల్లో రేషన్ దుకాణాల ఏర్పాటులో సాంకేతిక సమస్య ఏర్పడు తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 400 నుంచి 450 రేషన్ కార్డులు ఉంటేనే రేషన్ దుకాణా లు ఏర్పాటు చేయాలి. కొత్త గ్రామ పంచాయతీల్లో 200 నుంచి 500 లోపు నివాస గృహాలు ఉండడం, అందులోనూ 150 నుంచి 200 వరకే కార్డులు ఉండడంతో రేషన్ దుకాణాలు ఏర్పాటు కష్టతరం అవుతోందని అధికారులే చెబుతున్నారు.. కొత్త దుకాణం ఏర్పాటైతే పాత షాపుల్లో కార్డులు తగ్గి, డీలర్లకు ఆదాయం సైతం తగ్గిపోయే అవకాశం ఉందంటున్నారు. కొత్త దుకాణాల ఏర్పాటుపై జిల్లా యంత్రాంగం స్పందించి కొత్త దుకాణాలు ఏర్పాటు చేయాలని ప్రజల కోరుతున్నారు.
రేషన్ దుకాణలు ఏర్పాటు చేయాలి..
- పోశన్న, కోయపెల్లి
ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో రేషన్ దుకాణలు ఏర్పాటు చేయాలి. కొత్తగా గ్రామ పంచాయ తీలను ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నాయి. కాని రేషన్ దుకాణాలు ఇప్పటికీ ఏర్పాటు చేయక పోవడంతో ఇక్కడి ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతు న్నాయి. ప్రతి నెలా సుమారు ఐదు నుంచి ఏడు కిలో మీటర్ల దూరం వెళ్లి సరకులను తెచ్చుకుంటున్నాం. అధికారులు కొత్తగా ఏర్పడ్డ పంచాయతీల్లో రేషన్ దుకాణాలను ఏర్పాటు చేయాలి.