Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Feb 17 , 2026 | 06:38 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Feb 17, 2026 08:51 IST

    టీ20 వరల్డ్‌ కప్‌లో నేడు 3 మ్యాచ్‌లు

    • ఉదయం 11 గంటలకు చెన్నైలో కెనడా Vs న్యూజిలాండ్‌.

    • మధ్యాహ్నం 3 గంటలకు పల్లెకెలెలో ఐర్లాండ్‌ Vs జింబాబ్వే.

    • రాత్రి 7 గంటలకు ముంబైలో నేపాల్ Vs స్కాట్లాండ్‌ మ్యాచ్‌.

  • Feb 17, 2026 08:47 IST

    కర్నూలు: పత్తికొండ మండలం గుండు తండా సమీపంలో ఆటో బోల్తా

    • 15 మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం.

    • మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలింపు.

    • కూలి పనికి వెళ్తుండగా బోల్తా పడిన ఆటో.

  • Feb 17, 2026 08:45 IST

    జనగామ మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఉత్కంఠ

    • సోమవారం నాడు సభ్యుల ప్రమాణాల తర్వాత గందరగోళం.

    • సభ్యుల ఆందోళనలతో చైర్మన్‌ ఎన్నిక నేటికి వాయిదా.

    • ఎవరికీ మ్యాజిక్‌ ఫిగర్‌ లేకపోవడంతో ఉత్కంఠ.

  • Feb 17, 2026 08:02 IST

    ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 3 చోట్ల మున్సిపల్‌ చైర్మన్ల ఎన్నిక

    • కాగజ్‌నగర్‌, ఖానాపూర్, క్యాతనపల్లి మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక.

    • చైరన్‌ ఎన్నికలలో కీలకం కానున్న ఎక్స్‌ అఫీషియో ఓట్లు.

  • Feb 17, 2026 07:43 IST

    నేడు విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    • సాయంత్రం 6:10కి ఐఎన్‌ఎస్‌ డేగా చేరుకోనున్న రాష్ట్రపతి.

    • రాష్ట్రపతికి స్వాగతం పలకనున్న గవర్నర్‌ నజీర్‌.

    • నేవల్‌ బేస్‌లో రాష్ట్రపతి ముర్ము బాంక్వెట్ డిన్నర్.

    • రేపు ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూకు హాజరు.

  • Feb 17, 2026 07:06 IST

    నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం

    • రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తోన్న బీఆర్ఎస్ నేతలు.

    • సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ.

  • Feb 17, 2026 06:59 IST

    అమరావతి: నేడు నాలుగో రోజు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

    • 2026-27 వార్షిక బడ్జెట్‌పై ఉభయ సభల్లో నేటి నుంచి చర్చ.

    • శాసనసభలో నేడు మూడు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.

  • Feb 17, 2026 06:46 IST

    విశాఖలో నేవీ వేడుకలకు సన్నాహాలు

    • నేడు బీచ్‌ రోడ్‌లో సన్నాహక విన్యాసాలు.

    • ఐఎఫ్ఆర్, మిలన్‌ సందర్భంగా బీచ్‌ రోడ్‌లో ఆంక్షలు.

    • 18, 19 తేదీల్లో పాస్‌లు లేని వాహనాలకు నో ఎంట్రీ.

  • Feb 17, 2026 06:45 IST

    నేటి నుంచి హైదరాబాద్‌లో బయో ఏషియా-2026

    • హైటెక్స్‌లో రెండురోజుల పాటు సదస్సు.

    • గ్లోబల్‌ టెక్‌-బయో రంగంలో కొత్త ఆవిష్కరణలపై చర్చ.

  • Feb 17, 2026 06:38 IST

    తెలంగాణలో 11 చోట్ల నేడు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక

    • ఇబ్రహీంపట్నం, కాగజ్‌నగర్‌, జనగామ, ఇంద్రేశం, జహీరాబాద్‌.

    • సుల్తానాబాద్‌, ఖానాపూర్, తొర్రూర్‌, డోర్నకల్‌.

    • ఇల్లందు, క్యాతనపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక.