kumaram bheem asifabad-కాగజ్‌నగర్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే..
ABN , Publish Date - Feb 17 , 2026 | 10:15 PM
కాగజ్‌నగర్/కాగజ్‌నగర్ టౌన్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ మున్సిపాల్టీ చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఉదయం 11 గంటలకు తొలుత గెలుపొందిన కౌన్సిలర్లతో ప్రమా ణ స్వీకారం చేయించారు. అనంతరం ఎన్నికల ప్ర క్రియ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ 18వ వార్డుకు చెందిన షాహీన్ సుల్తానాకు 6వ వార్డు కౌన్సిలర్ ఎమ్మాజీ శారద బలపరిచి, 26వ వార్డు కౌన్సిలర్ షాహీన్ సుల్తానా మద్దతు ప్రకటించారు. బీఆర్‌ఎస్‌కు చెందిన 15వ వార్డు కౌన్సిలర్ సీపీ విద్యావతికి 11వ వార్డు కౌన్సిలర్ వలీ బలపరిచి, 10వ వార్డు కౌన్సిలర్ రాము మద్దతు పలికి చైర్మన్ బరిలోకి దింపారు.
- అందరి అంచనాలు తారుమారు
- అనూహ్యంగా కాంగ్రెస్-బీజేపీ పొత్తు
కాగజ్‌నగర్/కాగజ్‌నగర్ టౌన్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ మున్సిపాల్టీ చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఉదయం 11 గంటలకు తొలుత గెలుపొందిన కౌన్సిలర్లతో ప్రమా ణ స్వీకారం చేయించారు. అనంతరం ఎన్నికల ప్ర క్రియ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ 18వ వార్డుకు చెందిన షాహీన్ సుల్తానాకు 6వ వార్డు కౌన్సిలర్ ఎమ్మాజీ శారద బలపరిచి, 26వ వార్డు కౌన్సిలర్ షాహీన్ సుల్తానా మద్దతు ప్రకటించారు. బీఆర్‌ఎస్‌కు చెందిన 15వ వార్డు కౌన్సిలర్ సీపీ విద్యావతికి 11వ వార్డు కౌన్సిలర్ వలీ బలపరిచి, 10వ వార్డు కౌన్సిలర్ రాము మద్దతు పలికి చైర్మన్ బరిలోకి దింపారు. నిబంధనల ప్రకారం బీఆర్‌ఎస్ బరిలో ఉన్న పోటీదారునికి మద్దతుగా చేతులు లేపాలని అధికారులు సూచించారు. బీఆర్‌ఎస్ పార్టీకి 11 మంది కౌన్సిలర్లు, ఎంఐఎం-1, ఇద్దరు స్వతంత్రులు, బీజేపీకి చెందిన వార్డు నంబరు 29 కౌన్సిలర్ డాక్టర్ అనిత చేతులెత్తారు. దీంతో మొత్తం 15 సభ్యుల బలం ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో ఉన్న 18వ వార్డుకు చెందిన షాహీన్ సుల్తానా ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ-9, బీజేపీ పార్టీ-3, స్వతంత్రులు-2, ఎక్స్ ఆఫిషియో సభ్యులు ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్, సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు చేతులెత్తడంతో పూర్తి బలం సంఖ్య 16కు చేరడంతో కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్మన్‌గా కాంగ్రెస్‌కు చెందిన 18వ వార్డు కౌన్సిలర్ షాహీన్ సుల్తానా గెలిచినట్టు ప్రకటించారు. వైస్ చైర్మన్ పదవీకి కాంగ్రెస్, బీజేపీల మద్దతుతో లావణ్య, అంతకు ముందే బీఆర్‌ఎస్ చైర్‌పర్సన్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో వైస్ చైర్‌పర్సన్‌గా బీజేపీ కౌన్సిలర్ డాక్టర్ అనిత పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వార్డునంబరు 27 కౌన్సిలర్ సిద్దం రాజేశ్వరి చేతులెత్తక పోవడంతో బలం సంఖ్య 15కి వచ్చింది. అలాగే బీఆర్‌ఎస్ మద్దతు పలికిన డాక్టర్ అనితకు కూడా 15 సంఖ్య బలం వచ్చింది. ఇరువురికి సమా నం ఓట్లు రావడంతో అధికారులు లాటరీ పద్ధతి నిర్వహించి లక్కీ తీశారు. ఈ ప్రక్రియలో బీఆర్‌ఎస్ మద్దతుతో బరిలో ఉన్న బీజేపీ కౌన్సిలర్ డాక్టర్ అనిత గెలిచినట్టు అధికారులు ప్రకటించారు.
బీఆర్‌ఎస్ సభ్యుల నిరసనలు..
మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తుండగా, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు వనమాల రాము, వలీ నిరసన తెలిపారు. ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్‌కు కాగజ్‌నగర్‌లో ఓటు హక్కు లేదని, వెంటనే అధికారులు స్పందించి ఎక్స్ అఫిషీయోగా అనర్హుడిగా ప్రకటించాలని పదే పదే నిరసన తెలిపారు. ఈ విషయంలో వెంటనే కలెక్టర్‌తో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని పట్టుబట్టారు. ఎన్నికలు నిర్వహిస్తున్న అధికారులు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. ఎంఎల్‌సీ దండే విఠల్‌కు ఓటేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొనటంతో ఎన్నికలు కొనసాగించారు. కాంగ్రెస్ మద్దతు పలికిన అభ్యర్థి గెలుపొంటంతో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు కొంత మంది ధర్మం ఓడింది.. ఏం పార్టీ.. ఎవరికి మద్దతు చేశారంటూ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్‌బాబుపై సెటైర్లు వేస్తూ గోల చేశారు.
- బందోబస్తు మధ్య తరలింపు.
కాంగ్రెస్ పార్టీ సభ్యులు క్యాంపు మంచిర్యాలలో నిర్వహించగా మంగళవారం ఎన్నిక ఉండటంతో ఉదయం బస్సు ద్వారా కాగజ్‌నగర్‌కు తరలించారు. ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య కాగజ్‌నగర్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు ఈ క్యాంపు నుంచి రావటం విశేషం. ఉత్కంఠ భరితంగా సాగుతుందన్న ముఖ్య ఉద్దేశంతో జిల్లా ఎస్పీ నితికాపంత్ ఆధ్వర్యంలో డీఎస్పీ వహీదోద్దీన్, పట్టణ సీఐ ప్రేం కుమార్, రూరల్ సి.ఐ కుమార స్వామి, ఎస్సైలు, పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
జిల్లాలో అనూహ్యమైన కాంగ్రెస్-బీజేపీ పొత్తు..
కాగజ్‌నగర్ పురపాలక సంఘ ఎన్నికల్లో కాంగ్రెస్-9, బీఆర్‌ఎస్-11, ఎంఐఎం-1, స్వతంత్రులు-4 గెలిచారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాక పోవడంతో పొత్తులు పోవాల్సి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పూర్తి బాధ్యతలు తీసుకొన్నారు. హంగ్ ఏర్పడడంతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠం దక్కించుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తుతో కాంగ్రెస్ పార్టీ-9, బీజేపీ-5 ఉండటం, ఎక్స్ ఆఫిషియో సభ్యులుగా ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్, సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పక్క ప్రణాళిక వేశారు. అయినప్పటికీ బీజేపీకి చెందిన డాక్టర్ అనిత బీఆర్‌ఎస్‌కు మద్దతు పలుకటం, బీజేపీ వార్డునెం.21 కౌన్సిలర్ దూసరి కృష్ణవేణి హాజరుకాక పోవడం విశేషం. ఎన్నికల్లో ఒకిరిపై ఒకరు విమర్శలు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు పొత్తులు పెట్టుకోవడంపై స్థానికంగా చర్చనీయాంశమైంది.
కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్‌పర్సన్ బయోడేటా
పూర్తి పేరు: షాహీన్ సుల్తానా
వయస్సు: 43 సంవత్సరాలు
వృత్తి: గృహిణి
కులం: బీసీ ముస్లిం
విద్యార్హతలు: డిగ్రీ
కుటుంబ నేపథ్యం: ఒక కుమారుడు రేహాన్(బీటెక్), కూతురు ఆయేషా సిద్దికి(ఇంటర్)
రాజకీయ నేపథ్యం: గతంలో 2023-2025 వరకు కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పని చేశారు.