kumaram bheem asifabad- బాల్య వివాహాలను అరికట్టాలి
ABN , Publish Date - Feb 17 , 2026 | 10:19 PM
జిల్లాలో బాల్య వివాహాలు జరుగకుండా ప్రతి ఒక్కరూ అరికట్టేందకు చేయూతనివ్వాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్, సూర్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో బాల్య వివాహాము, భారత్-100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కె హరిత, జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ భాస్కర్‌తో కలిసి ప్రత్యేక ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బాల్య వివాహాలు జరుగకుండా ప్రతి ఒక్కరూ అరికట్టేందకు చేయూతనివ్వాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్, సూర్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో బాల్య వివాహాము, భారత్-100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కె హరిత, జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ భాస్కర్‌తో కలిసి ప్రత్యేక ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రచార వాహనం మైక్ సదుపాయంతో జిల్లాలోని గ్రామాలు, మండలాలు, గిరిజన ప్రాంతాలలో పర్యటిస్తూ బాల్య వివాహాలపై అవగాహన కల్పించనుంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వాటి నివారణ కోసం అన్ని విభాగాల సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు. బాల్యం ఎంతో విలువైన దశ అని, ప్రతి బాల బాలికలకు విద్య, ఆరోగ్యం, రక్షణ హక్కులు కల్పించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. బాల్య వివాహాం చట్టపరంగా నేరమని, అలాంటి ఘటనలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి బాల్య వివాహాల నిర్మూలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా సంక్షేమాధికారి భాస్కర్ మాట్లాడుతూ ఈ 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం ద్వారా పాఠశాలలు, కాలేజీలు, గ్రామ సభలు, ఆశ్రమ పాఠశాలలు, గిరిజన తండాల్లో విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణలో ప్రజల సహకారం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డీడీ రమాదేవి, డీసీపీఓ మహేష్, డీహెచ్‌ఈడబ్ల్యూ కో ఆర్డినేటర్ శారద, స్వచ్ఛంద సంస్థ కో ఆర్డినేటర్ సంతోష్‌కుమార్, ప్రభు, దేవాజీ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలి
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక సమగ్రత సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎలకో్ట్రరల్ అధికారి సుదర్శణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ముఖ్య ఎలకో్ట్రరల్ అధికారి కార్యాలయం నుంచి వీసీ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్, అదనపు కలెక్టర్‌లు, ఆర్డీవోలు, ఎంపీడీఓలు, తహసీల్దార్‌లతో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎలకో్ట్రరల్ అధికారి మాట్లాడుతూ ఓటరు జాబితాను, ఏబీసీడీ కేటగిరిలుగా మ్యాపింగ్ చేయాలన్నారు. బూత్ స్థాయి అధికారుల ఖాళీలను భర్తీ చేయాలని, బూత్ స్థాయి అధికారులు ప్రటి ఇంటికి వెళ్లి సమాచారం సేకరించాలని తెలిపారు. రాజకీయ పార్టీల నుంచి బూత్ స్థాయి ఏజెంట్ల జాబితా సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో గల వీసీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆ దిశగా ప్రజలందనరికి తెలిసే విధంగా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. బూత్ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లు, క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి ఇంటిని సందర్శించి సమాచారం సేకరిస్తున్నారని తెలిపారు. ఓటరు జాబితాను ఏబీసీడీ కేటగిరిలుగా విభజించి మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేస్తామని, మ్యాపింగ్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు జరగకుండా పర్యవేక్షిస్తామని తెలిపారు. రాజకీయ పార్టీల నుంచి బూత్ స్థాయి ఏజెంట్ల జాబితా సమర్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పారం 6, 7, 8 పెండింగ్ దరఖాస్తుల పరిష్కారారికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌లు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.