Home » Telangana
జిల్లాలో నేటి నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం ఈ మేరకు వ్యాపారులకు లైసెన్స్‌లు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 75మద్యం షాపులు ప్రారంభించను న్నారు. రామగుండం నగరపాలక సంస్థతో పాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సి పాలిటీలు, వివిధ మండలాల్లో కొత్త షాపులు ఏర్పాటు కానున్నాయి.
రామగుండంలో ఎన్ని శక్తులు అడ్డుపడ్డా ప్రజల అభిష్టం మేరకు విద్యుత్ కేంద్రం కట్టి తీరుతామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రామగుండంలో 800మెగావాట్ల విద్యుత్ కేంద్రం స్థాపనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆదివారం రామగుండం పట్టణానికి వచ్చిన ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు.
పంచాయతీ ఎన్నికలు పారదర్శ కంగా నిర్వహించాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీపీ రాంరెడ్డి, అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, డి వేణులతో కలిసి ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. . పట్టణంలోని ఆయన నివాసంలో ఆదివారం బీజేపీకి చెందిన సిర్పూరు(టి) మాజీ ఎంపీపీ మాలతీ బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు
కాగజ్‌నగర్ సామాజిక ఆసుపత్రి ఇక వంద పడకల ఆసుపత్రిగా మారనుంది. ప్రస్తుతం 30 పడకలతో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వంద పడకలకు అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పది రోజుల క్రితం ఇందుకు సంబంధించి జీవోను కూడా విడుదల చేశారు
జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. సిర్పూర్(టి), కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు, దహెగాం, పెంచికలపేట మండలాల్లోని 113 సర్పంచ్ స్థానాలకు, 992 వార్డు స్థానాలకు అధికారులు నామినేషన్లను స్వీకరించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచలు, వార్డు సభ్యుల వివరాలను టీ పోల్‌లో పకడ్బందీగా నమోదు చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. ఆదివారం మండలంలోని సలుగుపల్లి నామినేషన్ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లాతో కలిసి పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో నామినేషన్ వేసిన అభ్యర్థుల దరఖాస్తులను ఫాం-2ఎ, 2బి రిపోర్టులను ఎప్పటికప్పుడు అందజేయాలని సూచించారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఇచ్చిన షెడ్యూల్ లో అభ్యర్థుల తుది జాబితా అనంతరం ప్రచారానికి వారం రోజుల గడువు మాత్రమే మిగులుతోంది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యాకనే పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారం నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ మేరకు మూడు విడతల్లోనూ ఇదే పరిస్థితి ఉందని వాపోతున్నారు. పంచాయతీ ఎన్నికలకు తొలి విడతకు సంబంధించిన నామినేషన్ల గడువు శనివారం ముగిసింది.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తి కావడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవడంతో రాష్ట్రవ్యాప్తంగా 'ప్రజా పాలన ఉత్సవాలు' ఘనంగా జరుగనున్నాయి. డిసెంబర్ 1 నుంచి 9 వరకు..