Share News

దేవాదాయంలో డిప్యూటేషన్లు వద్దే వద్దు

ABN , Publish Date - Feb 18 , 2026 | 04:55 AM

ఇద్దరు ఎంపీడీవోలను డిప్యూటేషన్‌పై దేవాదాయశాఖలో నియమించడం వివాదాస్పదమైంది.

దేవాదాయంలో డిప్యూటేషన్లు వద్దే వద్దు

  • ఆ శాఖ ఉద్యోగుల డిమాండ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): ఇద్దరు ఎంపీడీవోలను డిప్యూటేషన్‌పై దేవాదాయశాఖలో నియమించడం వివాదాస్పదమైంది. దీన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో అటెండర్‌ నుంచి అదనపు కమిషనర్‌ వరకు సమావేశమై శాఖలోకి డిప్యూటేషన్లు వద్దేవద్దని తీర్మానించారు. డిప్యూటేషన్లను నిరసిస్తూ త్వరలో పెన్‌డౌన్‌, నల్లబ్యాడ్జిలతో విధులకు హాజరై నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ఆలయ ఈవోలు, అధికారులు, సిబ్బందిపై వచ్చే ఆరోపణలకు సత్వరం స్పందించాలని తీర్మానం చేశారు. ఈ అంశంపై బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ హరీశ్‌ను కలిసి వినతి పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.

Updated Date - Feb 18 , 2026 | 04:55 AM