Share News

ఇంజినీరింగ్‌ ఫీజు బకాయిలపై వివరాలు ఇవ్వండి

ABN , Publish Date - Feb 18 , 2026 | 04:49 AM

ఇంజినీరింగ్‌ కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

ఇంజినీరింగ్‌ ఫీజు బకాయిలపై వివరాలు ఇవ్వండి

  • ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ఇంజినీరింగ్‌ కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. తమకు రావాల్సిన బకాయిలకు సంబంధించి టోకెన్లు జారీ అయినప్పటికీ ఇప్పటికీ నిధులు విడుదల కావడం లేదంటూ కేశవ మెమోరియల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాలేజీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. మొత్తం బకాయిల వివరాలు తెలియజేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేస్తూ విచారణను రెండువారాలకు వాయిదా వేసింది.

Updated Date - Feb 18 , 2026 | 04:50 AM