Home » Telangana
విద్యుత్ లైన్ల మరమ్మతుల నిమిత్తం మంగళవారం హైదరాబాద్ నగరంలోని నిర్ణిత ఏరియాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.
రామగుం డం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అదనపు కలెక్టర్, కమిషనర్ అరుణశ్రీ, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహిం చారు.
ఎయిడ్స్‌పై ప్రజల్లో విద్యార్థులు సరైన అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా ఆసుపత్రి నుంచి అయ్యప్ప స్వామి ఆలయం, సిరి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు.
జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలు, ఇన్స్పైర్ అవార్డ్ మనాక్ జంట ఎగ్జిబిషన్లు ఎన్టీపీసీ ఉన్నత పాఠశాలలో ఈనెల 2, 3, 4 తేదీల్లో జరగనున్నాయి. సోమవా రం జిల్లా విద్యాధికారి శారద ఏర్పాట్లను పరిశీలించారు.
పాఠశాలల్లో విద్యా ర్థులను నాలుగు హౌజ్‌ల కింద విభజిస్తే వారికి మేలు జరుగుతుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్టర్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, గ్రంథాలయం సందర్శించారు.
విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు నిపుణుల ద్వారా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో సోమవారం ప్రధాన మంత్రి శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మండలంలో రైతులు వరి నారు మడులు తయారు చేస్తున్నారు. వరి పంట సాగులో భాగంగా నారు మడి తయారు చేయు రైతులు చలికాలం దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రి, ఉదయం సమయాల్లో ఉష్ణోగ్రత తీవ్రత పూర్తిగా పడిపోతుంది. అందువల్ల నారు మడిలో నీరును మారుస్తూ నీటి యజమాన్యం పాటించాలి. దీంతో చలి నుంచి నారుమడిని కాపాడు కోవచ్చు. నారు ఆరోగ్యంగా పెరిగితేనే పంట దిగుబడి వస్తుంది.
అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వ్దద విధి నిర్వహణలో ఉన్న అధికారులు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పకడ్బంధీగా తనిఖీలు నిర్వహించాలని ఎస్పీ నితికా పంత్ అన్నారు. వాంకిడి మండల సరిహద్దులోని అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టును సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీలకు సంబందించిన రిజిస్టర్లను పరిశీలించారు
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచే అభ్యర్థులను పెద్ద సంఖ్యలో గెలిపించుకుని సత్తా చాటుదామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లి, పాడిబండ గ్రామ పంచాయతీల పరిధిలో వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, మహిళలు, కార్యకర్తలు ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఊరికి ఒక్కసారైనా సర్పంచ్ కావాలనే కల చాలా మందికి ఉంటుంది. ప్రథమ పౌరుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశతో ఎన్నికల్లో పోటీకి ఏళ్లతరబడి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్లు ఉన్నారు