ప్రాణం తీసిన ‘పెయిన్ కిల్లర్’
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:22 AM
కాలు నొప్పి నివారణకు అధికంగా మాత్రలు వేసుకున్న వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
అధిక మాత్రలు వేసుకున్న వ్యక్తి మృతి.. సూర్యాపేటలో ఘటన
సూర్యాపేట క్రైం, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): కాలు నొప్పి నివారణకు అధికంగా మాత్రలు వేసుకున్న వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం భగత్‌సింగ్ నగర్ వాసి పుల్లూరి కనకయ్య(60) కూలీగా పని చేస్తూ జీవిస్తున్నాడు. గతంలో రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన కనకయ్యకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఇటీవల అదే కాలుకు గాయం కావడంతో భరించలేని నొప్పితో బాధపడుతున్నాడు. ఈ నొప్పి భరించలేక సోమవారం అధిక మాత్రలు వేసుకున్న కనకయ్య 2 గంటల తర్వాత నీరసంగా ఉందన్నాడు. కుటుంబ సభ్యులు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. అధికంగా నొప్పి నివారణ మాత్రలు వేసుకోవడం వల్లే కనకయ్య మృతి చెందాడని వైద్యులు తెలిపారు.