Home » Telangana Police
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఉప ఎన్నిక నేపథ్యంలో మూడు వేల మంది పోలింగ్ సిబ్బంది, రెండు వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారులు కీలక అంక్షలు విధించారు. అంక్షలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనేపథ్యంలో వివిధ పోలింగు స్టేషన్లకు ఎన్నికల సామాగ్రిని అధికారులు పంపిణీ చేశారు.
హైదరాబాద్‌లో సైబర్ అవేర్నెస్ ఉన్నప్పటికీ, ఇంకా బాధితులు ఉన్నారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సైబర్ బాధితులు తగ్గేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి.
ప్రతి రోజు లక్షల్లో సైబర్ ఫ్రాడ్ జరుగుతోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. పెట్టుబడులు పెట్టీ చాలా యాప్‌లలో పలువురు మోసపోతున్నారని చెప్పుకొచ్చారు. డిజిటల్ అరెస్ట్‌పై కూడా అవగాహన కల్పించామని పేర్కొన్నారు సీపీ సజ్జనార్.
పఠాన్‌చెరు పారిశ్రామికవాడ రూప కెమికల్స్ పరిశ్రమలో ఇవాళ(ఆదివారం) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం ధాటికి భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. మంటలు దట్టంగా వ్యాపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు.
తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు కేంద్ర కమిటీ మెంబర్ పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ శంకరన్న, చంద్రన్న, మావోయిస్టు రాష్ట్ర కమిటీ మెంబర్ బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ లొంగిపోయారు. అయితే, పుల్లూరి ప్రసాద్ రావుపై రూ.25 లక్షల రివార్డు ఉంది.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళా అధికారులను కాంగ్రెస్ మంత్రులు వేధిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్ .
హైదరాబాద్ నగరంలో ఇవాళ (శనివారం) కాల్పులు కలకలం సృష్టించాయి. సెల్‌ఫోన్ దొంగను పట్టుకునేందుకు డీసీపీ చైతన్య ప్రయత్నించారు. ఈ క్రమంలో డీసీపీ మీద కత్తితో దాడికి దొంగ యత్నించాడు.
హనుమకొండ నయీంనగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటనతో హనుమకొండలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. దీపావళితోపాటు రాబోయే పండుగల సందర్భంగా ఆన్ లైన్లో షాపింగ్ చేసే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.