Home » Telangana Congress
మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకత్వానికి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క భార్య వసూళ్లు, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి దౌర్జన్యాలు కనిపించడంలేదా? అని ప్రశ్నించారు.
కొండా సురేఖతో మంత్రిపదవికి రాజీనామా చేయించడానికే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ఆమె భవిష్యత్తుకు భరోసా ఇచ్చి రాజీనామా చేయించాలన్న ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై కాంగ్రెస్ హై కమాండ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో అభివృద్ధి పనులకు సంబంధించి నిర్వహించిన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో అధికారులు మంత్రి కొండా సురేఖ ఫొటోను పెట్టలేదు.
రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలన 1000 రోజులు పూర్తి చేసుకుందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ఈ వెయ్యి రోజుల పండుగలో విద్యా, వైద్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.
దేశంలో ఎక్కడైనా ప్రభుత్వం వైఫల్యం చూస్తాం కానీ తెలంగాణలో ప్రతిపక్షం తన పాత్ర పోషించడంలో విఫలమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ తన బాధ్యతల్లో పూర్తిగా ఫెయిల్ అయ్యారన్నారు.
బిహార్‌లో విద్యార్థులపై కాల్పులు, జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకారులపై లాఠీచార్జి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల బీజేపీ వ్యవహరించిన తీరు, రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు ఘటనలను నిరసిస్తూ.. యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కార్ రేపటితో వెయ్యిరోజుల మైలురాయిని పూర్తి చేసుకుంటుంది.
హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయం వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి, కార్యాలయ గేటుకు నల్ల రంగు పూస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ఓవైపు మంత్రి కొండా సురేఖ వ్యవహారం క్రమశిక్షణ కమిటీ నుంచి ఏఐసీసీ వద్దకు చేరి ఉత్కంఠ రేపుతుండగా, మరోవైపు పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.