Home » Telangana Congress
మాగంటి గోపీనాథ్ ఆస్తిపాస్తుల పంపకాల్లో మాజీ మంత్రి కేటీఆర్, సీఎం రేవంత్‌రెడ్డిల మధ్య గొడవలు మొదలయ్యాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తిపాస్తుల కోసమే వీరిద్దరి మధ్య పగలు, పట్టింపులు ఎక్కువయ్యాయని ఆక్షేపించారు. గోపీనాథ్ చనిపోయాక ఆయన ఆస్తులను వీళ్లిద్దరూ పంచుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు బండి సంజయ్ కుమార్.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో అసలు బీజేపీనే లేదని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక్కడ బీఆర్‌ఎస్ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని విమర్శించారు. ముస్లింలను బీఆర్‌ఎస్ మోసం చేస్తోందని ఆరోపించారు సీఎం రేవంత్‌రెడ్డి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నయా ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఆదివారం సమావేశం అయ్యారు.
తెలంగాణ కేబినెట్‌ని విస్తరించడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేబినెట్‌ని విస్తరించడానికి మార్గం సుగమం చేసింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి టూర్ షెడ్యూల్ ఖరారైంది.
స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది తెలంగాణ కాంగ్రెస్. ఈనెల 9వ తేదీన స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై హస్తం పార్టీ దృష్టి పెట్టింది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మోదీ ప్రభుత్వానిది మెతక వైఖరి అని మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. కేసీఆర్‌ను కాళేశ్వరం కేసు నుంచి తప్పించే అవకాశం ఉందని విమర్శించారు.
కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం కలిశారు. కాంగ్రెస్ ఎంపీల ఫోరమ్ చైర్మన్ మల్లు రవి ఆధ్వర్యంలో మంత్రి జేపీ నడ్డాను ఎంపీలు కలిశారు. ఈ వారంలో 62 వేల మెట్రిక్ టన్నులు యూరియా రాష్ట్రానికి ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం నాడు ఆందోళన చేపట్టారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు షాక్ తగిలింది. రోహిత్ వేముల ఆత్మహత్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు లీగల్ నోటీసులు పంపించారు.