BJP And Congress Protest: హైటెన్షన్.. బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల వద్ద భారీగా పోలీసులు
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:42 AM
జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును మోదీ ప్రభుత్వం మారుస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల ఎదుట భారీ ధర్నా చేపట్టాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది.
హైదరాబాద్, డిసెంబరు18 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును మోదీ ప్రభుత్వం మారుస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా బీజేపీ (BJP) ఆఫీసుల ఎదుట భారీ ధర్నా చేపట్టాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. అలాగే, నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో (National Herald Case) బీజేపీ (BJP) ఆఫీసుల ఎదుట ఈరోజు(గురువారం) తెలంగాణ వ్యాప్తంగా ధర్నా నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) నిర్ణయించారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో ధర్నాలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో గాంధీ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
ధర్నాను విజయవంతం చేయాలి: మహేశ్ కుమార్ గౌడ్

నేషనల్ హెరాల్డ్ కేసులో గత పదేళ్లుగా ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందని కాంగ్రెస్ అగ్రనేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తప్పు పట్టిందని ప్రస్తావించారు. బీజేపీ చేసిన అరాచకాలపై డీసీసీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరపాలని మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశించారు. కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ అనుబంధ సంఘాలు సీరియస్‌గా తీసుకొని ధర్నాను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు మహేశ్ కుమార్ గౌడ్.
బీజేపీ శ్రేణులు అలర్ట్..

ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంతో బీజేపీ శ్రేణులు కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ ముట్టడిపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
తమ కార్యాలయాలు ముట్టడిస్తామంటే ఊరుకునేది లేదని, ప్రతిఘటిస్తాం, తాటా తీస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. కార్యాలయాల ముట్టడులు, ధ్వంసం చేయడాలు మంచి సంస్కృతి కాదని మందలించారు. విచారణ సంస్థలకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏం జరిగిందన్నది విచారణ సంస్థలు, కోర్టులు చూసుకుంటాయని స్పష్టం చేశారు. బీజేపీపై నెపం వేసి, రాజకీయ పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని ధ్వజమెత్తారు రామచంద్రరావు.
ఈ వార్తలు కూడా చదవండి..
జడ్జిమెంట్‌పై సస్పెన్స్.. ఆ ఆలోచనలో స్పీకర్..!
ఐ బొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ.. కీలక అంశాలపై ఫోకస్
Read Latest Telangana News and National News