Home » Telangana BJP
ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న సుస్థిర మైనింగ్ పద్ధతులను తెలుసుకోవడంలో వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ సదస్సు చాలా కీలకమని కిషన్‌రెడ్డి వెల్లడించారు. మైనింగ్ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చాలా అవసరమని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రప్రభుత్వం ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుందని కిషన్‌రెడ్డి ఉద్గాటించారు.
జగన్ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి వారి లడ్డూలో జరిగిన కల్తీ భక్తులను ఆందోళనకు గురి చేసిందని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో తిరుమలలో జరిగిన అవినీతి, అక్రమాలఫై విచారణ జరపాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తానని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిల్లు చేసేటప్పుడు కవిత జైల్లో ఊచలు లెక్కపెడుతోందని విమర్శించారు. కవిత లేఖ రాసింది బీఆర్ఎస్ నాయకురాలిగానా.. జాగృతి నాయకురాలిగానా అని మహేష్ గౌడ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో లీడర్ల వ్యాపార భాగస్వాములంతా ఆంధ్రావాళ్లేనని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి ఆరోపణలు చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో కాంట్రాక్టులన్నీ ఏపీ వాళ్లకే ఇచ్చారని విమర్శించారు. నా భార్యది నెల్లూరు, సీఎం రేవంత్‌రెడ్డి అల్లుడిది ఆంధ్రా అని రాకేష్‌రెడ్డి పేర్కొన్నారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఈ అధ్యక్ష పదవి అడుగుతానని అన్నారు. అధ్యక్ష పదవి ఇస్తారా లేదా అనేది వాళ్ల ఇష్టమని రాజాసింగ్ పేర్కొన్నారు.
కాళేశ్వరం కమిషన్ సీరియల్‌గా నడుస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఫార్ములా ఈ రేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏడాది కాలం నుంచి సాగదీస్తున్నారని విమర్శించారు. అసలు ఈ కేసులపై రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.
ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ చేసిన అరాచకాల గురించి ప్రజలందరికీ తెలియాలని బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. నాడు పేదలపై అరాచకాలు చేశారని.. ఈనాడు సామాజిక న్యాయం అంటూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు నత్తనడకన నడుస్తోందని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. అధికారులందరూ కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహారించారని ఆరోపించారు ప్రభాకర్‌రావు నిబంధనలు అతిక్రమించి మాజీ సీఎం కేసీఆర్ కోసం పనిచేశారని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పినట్లుగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని ఏటీఎం లాగా బీఆర్ఎస్ నేతలు వాడుకున్నది వాస్తవం కాదా అని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా చెప్పిన మాటలే తమ స్టాండ్ అని రాజాసింగ్ ప్రకటించారు.
Rajasingh Controversy: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై తెలంగాణ బీజేపీ సీరియస్‌గా ఉంది. స్టేట్ బీజేపీపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.