Home » Telangana BJP
కార్ల విషయంలో తాను తప్పు చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీత మంచి మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రజల ఆశీర్వాదం కేసీఆర్‌కు ఉందని కేటీఆర్ ఉద్ఘాటించారు.
దసరా సెలవుల్లో కూడా ఉద్యోగులతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పని చేయిస్తోందని.. ఈ ఆలోచనను విరమించుకోవాలని బీజేపీ మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కోరారు. ఉద్యోగులను దసరా సెలవుల్లో కూడా పని చేయించడం సరికాదని చెప్పుకొచ్చారు.
జీఎస్టీ రూపంలో గతంలో ప్రజలపై విపరీతమైన భారాలు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మండిపడ్డారు. గతంలో కాఫీ మీద కూడా జీఎస్టీ 28 శాతం ఉండేదని రఘునందన్‌రావు గుర్తుచేశారు.
కామారెడ్డిలో వరద నష్టం అంచనాపై రీ సర్వే చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అర్వింద్ సూచించారు. కామారెడ్డిలో వరద నష్టానికి ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ఎంపీ ధర్మపూరి అర్వింద్ ప్రశ్నించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనపై టీ బీజేపీ చీఫ్ రామచందర్ రావు సెటైర్లు గుప్పించారు. 50 సార్లు ఢిల్లీ వెళ్లినందుకు రేవంత్‌రెడ్డికి ఆఫ్ సెంచరీ సెలబ్రేట్ చేయాలని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి ఫోబియా పట్టుకుందని రామచందర్ రావు విమర్శించారు.
నిరుద్యోగులకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు. భారీస్థాయిలో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు.
42శాతం బీసీ రిజర్వేషన్లతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉద్ఘాటించారు. కామారెడ్డి బీసీ విజయోత్సవ బహిరంగ సభ విజయవంతం కోసం జనసమీకరణ ఏర్పాట్లపై చర్చించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. సాధారణ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించి క్రమశిక్షణతో, అకుంఠిత దీక్షతో నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు శ్రమించి ఇవాళ ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ జీవితం స్ఫూర్తిదాయకని కిషన్‌రెడ్డి కొనియాడారు.
యూరియా సమస్యపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ తరుపున పోరుబాట పడుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. యూరియా సమస్యను పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
నల్లగొండ పాతబస్తీ ఒకటో నంబర్ వినాయకుడి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగిస్తుండగా బీజేపీ నేతలు అడ్డుకున్నారు. గణేష్ ఉత్సవాల్లో రాజకీయాలు మాట్లాడటమేంటని బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.