Home » Telangana Assembly
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అంశం తెలంగాణ అసెంబ్లీని కుదిపేస్తోంది. దీనిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సభలో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు.
శాసనసభలో బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి.. చేయలేదని అంటున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం నడిచింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు.
తెలంగాణ వర్షకాల అసెంబ్లీ సమావేశాలు నేడు రెండో రోజుకు చేరుకున్నాయి. సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజే సభ బయట, వెలుపల ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ రోజు(మంగళవారం)రెండో రోజు సమావేశంలో ఏం జరుగుతుందనే అంశం చర్చనీయాంశమైంది..
శాసనసభ సమావేశాలను శనివారం దాకా నిర్వహించాలని, కాళేశ్వరం, కృష్ణ-గోదావరి జలాలు, విద్య, 22-ఏ తదితర అంశాలపై చర్చించాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన భేటీ అయిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) నిర్ణయించింది.
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను బీఆర్‌ఎస్ నేతలు అత్యంత హేయమైన, అసభ్యకరమైన పదజాలంతో దుర్భాషలాడి ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. సభా గౌరవాన్ని దిగజార్చేలా ప్రవర్తించిన బీఆర్‌ఎస్ నేతలు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ సోమవారం చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బారికేడ్లను దాటుకుంటూ, పోలీసుల ఆంక్షలను ఛేదించుకుంటూ పార్టీ కార్యకర్తలు అసెంబ్లీ మెయిన్ గేటు వద్ద ఆందోళనకు దిగారు.