Telangana Asesembly LIVE: తెలంగాణ - మహారాష్ట్ర మధ్య నిలిచిన రాకపోకలు..
ABN , First Publish Date - Aug 30 , 2025 | 10:22 AM
Telangana Assembly Sessions 2025 Live Updates in Telugu: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ఇచ్చిన నివేదిక సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల లైవ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తోంది ఆంధ్రజ్యోతి.
Live News & Update
-
Aug 30, 2025 11:34 IST
తెలంగాణ - మహారాష్ట్ర మధ్య నిలిచిన రాకపోకలు..
నిజామాబాద్: తెలంగాణ - మహారాష్ట్ర మధ్య రాకపోకలకు అంతరాయం.
మద్నూర్ మండలం సలాబత్ పూర్ చెక్ పోస్ట్ వద్ద నిలిచిపోయిన వాహనాలు.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలి వద్ద బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తున్న వరద.
రాకపోకలు నిలిపివేసిన అధికారులు.
-
Aug 30, 2025 11:28 IST
తెలంగాణ హైకోర్టులో హరీష్‌రావు హౌస్ మోషన్ పిటిషన్
కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టొద్దని పిటిషన్
అసెంబ్లీలో నివేదిక పెట్టకుండా ఆదేశాలివ్వాలని హరీష్‌రావు వినతి
-
Aug 30, 2025 11:27 IST
తెలంగాణ శాసన మండలి సోమవారానికి వాయిదా
మాజీ MLCలు రత్నాకర్, రంగారెడ్డి మృతికి మండలి సంతాపం
-
Aug 30, 2025 11:02 IST
గోపీనాథ్ మంచి స్నేహితుడు: శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
విద్యార్థి దశ నుంచే గోపినాథ్ చురుకుగా ఉండేవారు
1983లో తెలుగుదేశం పార్టీలో గోపీనాథ్ తన రాజకీయ ప్రస్థానాన్ని గోపీనాథ్ ప్రారంభించారు.
1985 నుంచి 1992 వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేశారు.
1987-88 లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ డైరెక్టర్‌గా, 1988-93 లో జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడిగా పనిచేశారు.
గోపీ ఎన్టీఆర్‌కు గొప్ప భక్తుడు.
సినీ రంగంలోనూ గోపీనాథ్ నిర్మాతగా రాణించారు.
సినిమా రంగంపై అభిమానంతో ‘పాతబస్తీ’(1995), ‘రవన్న’(2000), ‘భద్రాద్రి రాముడు’ (2004), ‘నా స్టైలే వేరు’ (2009) వంటి నాలుగు సినిమాలకు గోపీనాథ్ నిర్మాతగా వ్యవహరించారు.
మాగంటి గోపినాథ్ నాకు మంచి మిత్రుడు.
రాజకీయంగా పార్టీలు వేరైనా.. వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడు.
వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఘనత సాధించిన వారిలో ఆయన ఒకరు.
ఆయన మరణం వారి కుటుంబానికి తీరని లోటు.
ఆయన అకాల మరణం ఆ కుటుంబానికి శోకాన్ని మిగుల్చింది.
చూడటానికి ఆయన క్లాస్ గా కనిపించినా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఆయన మాస్ లీడర్.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా.
-
Aug 30, 2025 10:52 IST
మునుగోడు ఎమ్మెల్యే ఇంట్రస్టింగ్ కామెంట్స్..
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.
పదవి ఎవరికీ శాశ్వతం కాదు.
మంచి వ్యక్తిత్వం, సేవ చేయాలనే గుణమే శాశ్వతం.
సేవాగుణం చచ్చేవరకూ ఉంటుంది.
కానీ, పదవి ఉండదు.
ఎమ్మెల్యేగా కాకుండా ఒక వ్యక్తిగా సహాయం చేస్తా.
ప్రభుత్వమే అన్నీ చేయాలంటే కూడా సాధ్యం కాదు.
-
Aug 30, 2025 10:49 IST
మాగంటి గోపీనాథ్ మృతికి సభ సంతాపం..
-
Aug 30, 2025 10:48 IST
కాళేశ్వరంపై ప్రజెంటేషన్ ఇస్తామంటే ఎందుకు భయం?: హరీశ్‌రావు
మాకు అవకాశం ఇవ్వడం లేదంటేనే ప్రభుత్వం భయపడిన్నట్లు కాదా?
వాస్తవాలు వినడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదు: హరీశ్‌రావు
నిజాలు తేల్చాల్సింది కోర్టులు మాత్రమే: హరీశ్‌రావు
-
Aug 30, 2025 10:40 IST
అసెంబ్లీలో దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి పై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
-
Aug 30, 2025 10:31 IST
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరం
కేటీఆర్ నాయకత్వంలో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
-
Aug 30, 2025 10:30 IST
హైదరాబాద్: KPHB కాలనీలో దారుణం
అప్పుల బాధతో చనిపోవాలని దంపతుల నిర్ణయం.
భర్త రామకృష్ణ గొంతుకోసి చంపిన భార్య రమ్యకృష్ణ.
అనంతరం గొంతు కోసుకుని భార్య ఆత్మహత్యాయత్నం.
భార్య రమ్యకృష్ణ పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
-
Aug 30, 2025 10:30 IST
హైదరాబాద్: గన్‌పార్క్ దగ్గర కాంగ్రెస్ నేతల నివాళులు
పాల్గొన్న విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్‌నాయక్
-
Aug 30, 2025 10:29 IST
అసెంబ్లీలో ఏ అంశం పెట్టినా చర్చకు మేం సిద్ధం: కేటీఆర్
కాళేశ్వరంపై వేసింది పీసీ ఘోష్ కమిసన్ కాదు.. పీసీసీ కమిషన్
అసెంబ్లీని 15 రోజుల పాటు నిర్వహించాలి: కేటీఆర్
-
Aug 30, 2025 10:29 IST
హైదరాబాద్: గన్‌పార్క్ దగ్గర BRS ప్రజాప్రతినిధుల నిరసన
అమరవీరుల స్థూపం దగ్గర ప్లకార్డులతో నిరసన ప్రదర్శన
రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్
నిరసనలో పాల్గొన్న కేటీఆర్, హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి
-
Aug 30, 2025 10:29 IST
కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తొలి రోజు ఉభయసభల్లోనూ సంతాప తీర్మానాలు.
ఎమ్మెల్యే గోపీనాథ్ మృతిపట్ల అసెంబ్లీలో సంతాప తీర్మానం.
మాజీ MLCలు రత్నాకర్, రంగారెడ్డి మృతిపట్ల మండలిలో సంతాప తీర్మానం.
తీర్మానాలపై చర్చ తర్వాత సమావేశాలు వాయిదా.
-
Aug 30, 2025 10:22 IST
కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రత్యేక చర్చ