Home » Team India
భారత డ్రెస్సింగ్ రూమ్ ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును మేనేజ్మెంట్ ప్రకటించింది. మాజీ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మనే ఈ అవార్డు వరించింది. మూడో వన్డేలో సెంచరీ చేసిన అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కూడా వచ్చాయి.
రోహిత్, విరాట్ వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉన్నారని తెలియగానే 2027 ప్రపంచ కప్ కోసం వారు ఉండాలనుకుంటున్నారని స్పష్టమైంది. వాళ్లు ఫామ్‌లో ఉన్నా లేకపోయినా.. పరుగులు చేసినా చేయకపోయినా.. వారి సామర్థ్యం, అనుభవాన్ని బట్టి వరల్డ్ కప్ తుది జట్టులో రో-కో కచ్చితంగా ఉంటారు.
కానీ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడం.. అద్భుత ప్రదర్శన చేయడం మాత్రం అభిమానులకు జోష్ తెప్పించింది. కేవలం వన్డేల్లోనే ఆడుతున్న ఈ ఇద్దరి బ్యాటింగ్‌ను చూసి సిడ్నీ ప్రేక్షకులు కూడా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అయితే.. ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. రో-కో మళ్లీ మైదానంలో కనిపించేది ఎప్పుడు..?
సిడ్నీలో జరిగిన మూడో వన్డేకు ముందు టీమిండియా బౌలర్ హర్షిత్ రాణాపై హెడ్ కోచ్ గంభీర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఒక దశలో సరిగ్గా ఆడకపోతే.. జట్టులో కొనసాగడం కష్టమేనని తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని హర్షిత్ రాణా చిన్ననాటి కోచ్ శ్రవణ్ వెల్లడించాడు..
టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో యంగ్ ప్లేయర్లతో కూడిన టీమిండియా జట్టు బరిలోకి దిగనుంది. వన్డే జట్టులో ఆడిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ స్వదేశ పయనం కానున్నారు.
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ( 121*)సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(74*) అర్ధ శతకంతో రాణించాడు. ఈ ఇద్దరి సూపర్ బ్యాటింగ్‌తో భారత్ చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఆఖరి మ్యాచ్‌లో ఓడినా ఆసీస్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. సమష్టి ప్రదర్శనతోనే ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ గిల్ అన్నాడు.
సిడ్నీ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. చివరి వన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో చేలరేగాడు. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.
తొడ కండరాల గాయంతో ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మూడో వన్డేకు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఈ జాబితాలో చేరాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో క్యాచ్ అందుకునే క్రమంలో తీవ్రంగా గాయపడ్డాడు.
కోహ్లీకి అక్టోబర్ 25 అస్సలు కలిసి రాదనే రికార్డు ఉంది. తన కెరీర్లో ఈ తేదీన ఆడిన వన్డేల్లో కోహ్లీ అత్యధిక స్కోర్ 30 పరుగులే. ఈ నేపథ్యంలో సిడ్నీలో ఈ ప్రతికూల రికార్డును కోహ్లీ ఎలా అధిగమిస్తామనేది ఆసక్తికరంగా మారింది..
ఓ వైపు మ్యాచ్‌ల టెన్షన్ ఉండగా.. మరోవైపు భారత యువ ఆటగాళ్లు షికార్లు చేస్తున్నారు. వాళ్లే స్వయంగా ఉబర్ బుక్ చేసుకుని మరీ వెళ్లారు. ఇంతకీ ఎవరు వెళ్లారు. ఎక్కడికి వెళ్లారంటే...