Share News

‘సర్’ విచారణకు హాజరైన టీమిండియా క్రికెటర్ షమీ

ABN , Publish Date - Jan 20 , 2026 | 04:20 PM

టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి సర్ నుంచి నోటీసులు అందిన విషయం తెలిసిందే. దీంతో షమీ మంగళవారం కోల్‌కతాలోని బిక్రంగఢ్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో ఎన్నికల సంఘం అధికారుల ముందు ఆయన విచారణకు హాజరయ్యారు.

‘సర్’ విచారణకు హాజరైన టీమిండియా క్రికెటర్ షమీ
Mohammad Shami

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ(SIR)లో పలువురు ప్రముఖులకు ఎన్నికల అధికారుల నుంచి నోటీసులు అందిన విషయం తెలిసిందే. అందులో భాగంగా టీమిండియా స్టార్ ప్లేయర్ మహ్మద్ షమీకి కూడా నోటీసులు ఇచ్చారు. దీంతో షమీ మంగళవారం కోల్‌కతాలోని బిక్రంగఢ్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో ఎన్నికల సంఘం అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. అధికారులకు సంబంధిత డాక్యుమెంట్లను అందజేశారు షమీ.


ఎస్ఐఆర్ దరఖాస్తులో మహ్మద్ షమీ పేర్కొన్న వివరాల్లో.. కొన్ని చోట్ల వ్యత్యాసాలు కనిపించాయని, అందుకే విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులిచ్చినట్లు ఈసీ సీనియర్ అధికారులు పేర్కొన్నారు. ఇదివరకే ఓసారి నోటీసులు ఇచ్చినప్పటికీ.. క్రికెట్ మ్యాచ్ కారణంగా మరోసారి అవకాశం ఇచ్చామని చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన షమీ.. క్రికెట్ కోసం కోల్‌కతాకు షిఫ్ట్ అయ్యారు. ఈ క్రమంలో నగరంలోని 93వ వార్డులో ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఈ వార్డు రాస్‌బిహారీ అసెంబ్లీ స్థానం పరిధిలోకి వస్తుంది.


ఇవి కూడా చదవండి:

రో- కోకు డిమోషన్.. సెంట్రల్ కాంట్రాక్టుల్లో ‘బి గ్రేడ్’?

సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్‌.. వివాదంలో రింకూ సింగ్!

Updated Date - Jan 20 , 2026 | 04:43 PM