Share News

Harshit Rana: రోజూ నాన్న ముందు ఏడ్చేవాడిని.. హర్షిత్ రాణా భావోద్వేగం..

ABN , Publish Date - Jan 18 , 2026 | 08:34 PM

భారత జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా గొప్పగా రాణిస్తున్న విషయం తెలిసిందే. హెడ్ కోచ్ గంభీర్‌ వల్ల హర్షిత్‌కి తుది జట్టులో చోటు దక్కుతుందంటూ అభిమానుల నుంచి క్రికెట్ మాజీల వరకు చర్చించుకున్న సందర్భాలూ ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన జీవితంలో ఎదుర్కొన్న కఠిన దశలను హర్షిత్ రాణా గుర్తు చేసుకున్నాడు..

Harshit Rana: రోజూ నాన్న ముందు ఏడ్చేవాడిని.. హర్షిత్ రాణా భావోద్వేగం..
Harshit Rana

ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా గొప్పగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే అతడి ఎంపికపై ఎన్నో విమర్శలు వచ్చాయి. హెడ్ కోచ్ గంభీర్‌ వల్ల హర్షిత్‌కి తుది జట్టులో చోటు దక్కుతుందంటూ అభిమానుల నుంచి క్రికెట్ మాజీల వరకు చర్చించుకున్న సందర్భాలూ ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన జీవితంలో ఎదుర్కొన్న కఠిన దశలను హర్షిత్ రాణా(Harshit Rana) గుర్తు చేసుకున్నాడు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు.


‘ఇప్పుడు ఎన్ని వైఫల్యాలు ఎదురైనా ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. భారత జట్టులో ఎంపికవడానికి ఎంతో కష్టపడ్డాను. దాదాపు పదేళ్లు ఎదురుచూశాను. ట్రయల్స్‌కు వెళ్తే పేరు రాకపోయేది. ఇంటికి వచ్చి రోజూ నాన్న ముందు ఏడ్చేవాడిని. ఇప్పుడు ఓడిపోతాననే భయం పోయింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోగలను. ఒకానొక దశలో నాపై నేనే నమ్మకం కోల్పోయాను. కానీ మా నాన్న మాత్రం నన్ను ముందుకు నడిపిస్తూనే ఉన్నారు’ అని హర్షిత్ చెప్పుకొచ్చాడు.


వన్డేల్లో మెరుపు ప్రదర్శన..

హర్షిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో ముఖ్యంగా వన్డేల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 13 వన్డేల్లో 23 వికెట్లు పడగొట్టాడు. 2025 ఏడాదిని భారత తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షిత్ ముగించడం విశేషం. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ కీలక పాత్ర పోషిస్తూ.. వన్డేలు, టీ20ల్లో ఫినిషర్‌గా విలువైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు.


టీ20 వరల్డ్ కప్‌లో అవకాశం..

హర్షిత్ రాణాకు మరో పెద్ద అవకాశం లభించింది. భారత్ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్–2026 కోసం ప్రకటించిన 15 మంది జట్టులో ఆయనకు చోటు దక్కింది. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ–2025 విజేత జట్టులో భాగమైన హర్షిత్.. ఏడాది వ్యవధిలో రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచే అవకాశాన్ని అందుకున్నారు. ఇప్పటివరకు ఆడిన ఆరు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఏడు వికెట్లు తీసిన హర్షిత్.. భారత బౌలింగ్ విభాగానికి కీలక ఆయుధంగా మారుతున్నాడు.


ఇవి కూడా చదవండి..

మిచెల్‌ను మైదానం నుంచి బయటకు నెట్టిన కోహ్లీ.. ఫన్నీ వీడియో వైరల్

అథర్వ తైడే సెంచరీ.. సౌరాష్ట్ర లక్ష్యం 318

Updated Date - Jan 18 , 2026 | 08:44 PM