Share News

IND VS NZ 3rd ODI: ప్రమాదంలో భారత్ ఐదేళ్ల రికార్డు..

ABN , Publish Date - Jan 17 , 2026 | 04:48 PM

రేపు భారత్, న్యూజిలాండ్ మధ్య చివరి వన్డే జరగనుంది. ఇప్పటికే 1-1 సమానంగా ఉన్న ఇరుజట్లకు.. రేపటి మ్యాచ్ కీలకం కానుంది. ఇదే సమయంలో భారత్‌కు సంబంధించిన ఐదేళ్ల రికార్డుకు ప్రమాదం పొంచి ఉంది.

 IND VS NZ 3rd ODI: ప్రమాదంలో భారత్ ఐదేళ్ల రికార్డు..
India vs New Zealand ODI

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం.. భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడు వన్డే మ్యాచుల సిరీస్‌లో 1-1తో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. ఇండోర్ వేదికగా ఆదివారం చివరి వన్డే జరగనుంది. సిరీస్ ఎవరి సొంతం అనేది తెలియడానికి ఈ మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారింది. ఇదే సమయంలో భారత్‌కు సంబంధించిన ఓ ఐదేళ్ల రికార్డు ప్రమాదంలో పడింది. న్యూజిలాండ్ ఆ రికార్డును బ్రేక్ చేస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ రికార్డు ఏంటి? దానికి వాటిల్లిన ముప్పు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


సొంత గడ్డపై టీమిండియాకు తిరుగులేని రికార్డు ఉంది. మార్చి 2019 తర్వాత ఇప్పటివరకు భారత జట్టు స్వదేశంలో ఒక్క వన్డే సిరీస్ కూడా ఓడిపోలేదు. అయితే.. తాజాగా ఆ ఐదేళ్ల నాటి రికార్డుకు ముప్పు పొంచి ఉంది. మొదటి మ్యాచులో ఓడిన కివీస్ జట్టు, రెండో మ్యాచులో ఓడి ఉంటే.. రికార్డుకు వచ్చిన ప్రమాదం ఏమి ఉండేది కాదు. అయితే.. రెండో మ్యాచులో న్యూజిలాండ్ గెలవడంతో ఆ జట్టుకు చారిత్రాత్మక అవకాశం దక్కింది. 1989 నుంచి న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్నప్పటికీ.. ఒక్క వన్డే సిరీస్‌నూ గెలవలేదు. ఒకవేళ రేపు గెలిస్తే కివీస్ కెప్టెన్, జట్టు చరిత్ర సృష్టించినట్లు అవుతుంది. ఇదే సమయంలో ఐదేళ్లుగా ఉన్న భారత్ రికార్డు బద్దలవుతుంది. ఇరు జట్లూ సమ ఉజ్జీలుగా కనిపిస్తుండటంతో క్రికెట్ అభిమానులకు ఈ మ్యాచ్ ద్వారా పసందైన వినోదం గ్యారంటీ. భారత ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమించి ఆడితే ఈ సిరీస్ మన సొంతమవుతుంది.


మరోవైపు.. మూడో వన్డే మ్యాచ్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు అగ్నిపరీక్ష కానుంది. ఎందుకంటే.. గౌతీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా పలు ఓటములు చవిచూసింది. శ్రీలంకలో వన్డే సిరీస్ కోల్పోవడం, స్వదేశంలో టెస్టు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో అతనిపై విమర్శలు వచ్చాయి. జనవరి 18న ఇండోర్‌లో జరిగే చివరి వన్డేలో ఓడితే మాత్రం గంభీర్ ఖాతాలో మరో చెత్త రికార్డు చేరుతుంది. కాబట్టి కోచ్‌గా గంభీర్.. రేపటి మ్యాచ్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి:

ముదిరిన భారత్-బంగ్లా వివాదం.. ఆటగాళ్ల నో హ్యాండ్ షేక్

ఐసీసీ అధికారికి వీసా నిరాకరించిన బంగ్లాదేశ్.!

Updated Date - Jan 17 , 2026 | 05:43 PM