Home » Team India
శనివారం నాడు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మీడియాతో మాట్లాడారు. ఐసీసీ సమావేశానికి పీసీబీ ఛైర్మన్ నఖ్వీ కూడా హాజరయ్యారని, అజెండాలో లేనప్పటికీ తాను, నఖ్వీ.. ఐసీసీ అధికారుల సమక్షంలో భేటీ అయ్యామని సైకియా అన్నారు. చర్చల ప్రక్రియ ప్రారంభం కావడం బాగుందని, ఇరు పక్షాలూ ఈ సమావేశంలో సహృదయంతో పాల్గొన్నాయని తెలిపారు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న అనధికారిక టెస్టు మ్యాచులో టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్ ధ్రువ్ జురెల్ తన కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్ ను కనబరుస్తున్నాడు. ఈ టెస్టులో జురెల్ సెంచరీ మోత మ్రోగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో తన సూపర్ జెంచరీతో జట్టును ఆదుకున్న జురెల్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లోనూ మరో శతకం చేశాడు.
2028లో లాస్ ఏంజెలెస్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఎలా నిర్వహించాలన్న దానిపై ఐసీసీ కొన్ని రూల్స్ ను రూపొందించింది. తాజాగా దుబాయ్‌లో జరిగిన సమావేశంలో వీటిని ఖరారు చేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఆరు జట్లు చొప్పున పురుషులు, మహిళల జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయని ఆ కథనంలో పేర్కొన్నాయి.
భారత-ఏ జట్టును ప్రకటించే ముందు టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై పలు వార్తలు వచ్చాయి. అనధికారిక వన్డే సిరీస్ లో వీరిద్దరు ఆడుతారని ప్రచారం జరిగింది. కానీ ఈ ఇద్దరు ప్లేయర్లు ఎంపికవ్వలేదు.
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో జరిగిన ఇంటరాక్షన్‌లో శ్రీ చరణి.. తన క్రికెట్ ప్రయాణం గురించి పంచుకుంది. క్రికెట్ ఆడేందుకు పరీక్షలు రాయనని తరుచు బెదిరించేదానని తెలిపింది.
మహిళల ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన అమన్‌జోత్ తన నానమ్మ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఖండించింది. ఆమె బాగానే ఉన్నారని, అవాస్తవ ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేసింది.
ఆసియా కప్‌లో ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు హారిస్ రవూఫ్‌పై ఐసీసీ రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. సూర్య కుమార్ యాదవ్, బుమ్రా, ఫర్హాన్‌లపై కూడా జరిమానాలు విధించారు.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల శ్రీ చరణి.. 9 మ్యాచ్‌ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టి.. అద్భుతంగా రాణించింది. 9 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ మినహా.. ప్రతీ మ్యాచ్‌లో శ్రీ చరణి వికెట్ తీసింది.
ప్రపంచకప్ గెలుపుతో భారత మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌ల ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగింది.
మహిళా జట్టు ప్రపంచకప్ గెలిచిన తర్వాత మిథాలీ రాజ్‌కు ట్రోఫీ అందించడం అద్భుతమని రవిచంద్రన్ అశ్విన్ అభినందించాడు. పురుషుల జట్టు అలాంటి పని ఎప్పుడూ చేయలేదని పేర్కొన్నాడు.