అండర్-19 డబ్ల్యూసీ: 204 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
ABN , Publish Date - Jan 27 , 2026 | 09:41 PM
అండర్-19 ప్రపంచ కప్-2026లో యువ భారత్ దూసుకెళ్తోంది. సూపర్ సిక్స్ లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 204 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రత్యర్థిని 148 పరుగులకే ఆలౌట్ చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: అండర్-19 ప్రపంచ కప్(Under 19 World Cup 2026)లో యంగ్ ఇండియా దూసుకెళ్తోంది. సూపర్ సిక్స్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 204 పరుగుల తేడాతో అఖండ విజయాన్ని సాధించింది. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రత్యర్థిని 148 పరుగులకే ఆలౌట్ చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో లీరాయ్(62) హాఫ్ సెంచరీతో రాణించగా.. కియాన్(37), టటేండ్ర(29) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ముగ్గురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో ఉద్దవ్, ఆయుశ్ మూడేసి వికెట్లు పడగొట్టారు. అంబ్రిష్ రెండు వికెట్లు, హెనిల్, ఖిలాన్ చెరో వికెట్ తీశారు.
మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగులు భారీ స్కోర్ చేసింది. టీమిండియా బ్యాటర్లలో విహాన్ మల్హోత్రా (109) సూపర్ సెంచరీతో చెలరేగాడు. అలానే అభిజ్ఞాన్(61), వైభవ్‌సూర్యవంశీ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు. అలానే ఆరోన్ జార్జ్ (23), ఆయుష్ మాత్రే (21), అంబరీష్ (21), వేదాంత్ త్రివేది (15) పరుగులు చేశారు.
చివర్లో ఖిలాన్ పటేల్ (30 ) దూకుడుగా ఆడాటంతో భారత్ 350 మార్క్ ను టచ్ చేసి.. అదనంగా రెండు పరుగులు చేసింది. ఇక జింబాబ్వే బౌలర్లలో చిముగోరో 3, పనాషే మజై 2, సింబరాషే 2, ధ్రువ్ పటేల్ ఒక వికెట్ తీశారు. అనంతరం 353 పరుగుల భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే 148 పరుగులకే(37.4ఓవర్లు) ఆలౌటైంది. మొత్తంగా పాయింట్ల పట్టికలో గ్రూప్-2లో ఆరు విజయాలతో భారత్ జట్టు టాప్ ప్లేసులో(India U19 points table) ఉంది. రెండు, మూడు స్థానాల్లో ఇంగ్లాండ్, పాకిస్థాన్ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
'అతను నిస్వార్థపరుడు'.. అభిషేక్ శర్మపై మంజ్రేకర్ ప్రశంసలు..
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ అరెస్ట్