టీ20 వరల్డ్‌కప్-2026 వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ రిలీజ్
ABN , Publish Date - Jan 27 , 2026 | 08:33 PM
టీ20 ప్రపంచ కప్-2026 టోర్నీకి సంబంధించిన వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదలైంది. ఈ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ వైదొలగడం, ఆ స్థానంలో స్కాట్లాండ్ ఎంట్రీ ఇవ్వడం వంటి పరిస్థితు మధ్య షెడ్యూల్ ప్రకటన ఆలస్యమైంది. వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా భారత్ ఒకే ఒక మ్యాచ్ ఆడనుంది.
స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ ప్రియులతో సహా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచకప్(T20 World Cup 2026) మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ మెగా టోర్నీకి సంబంధించిన ప్రతి అప్‌డేట్ కోసం క్రికెట్ లవర్ ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. తాజాగా ఈ మెగా టోర్నీ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదలైంది. టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలగడం, ఆ స్థానంలో స్కాట్లాండ్ ఎంట్రీ ఇవ్వడం వంటి పరిస్థితుల మధ్య షెడ్యూల్ ప్రకటన ఆలస్యమైంది. వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా భారత్ ఒకే ఒక మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు 16 వార్మప్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఇదే వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా భారత-ఏ జట్టు కూడా రెండు మ్యాచ్‌లు ఆడనుంది. యూఎస్‌ఏ, నమీబియా జట్ల ప్రాక్టీస్ కోసం ఈ మ్యాచ్‌లు షెడ్యూల్ చేయబడ్డాయి. ఫిబ్రవరి 2న భారత-ఏ జట్టు యూఎస్‌ఏతో తలపడనుంది. అలానే ఫిబ్రవరి 6న బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్‌లో నమీబియాతో ఆడనుంది.
వార్మప్ మ్యాచుల షెడ్యూల్ ఇదే:
ఫిబ్రవరి 2
అఫ్గనిస్థాన్ vs స్కాట్లాండ్
భారత్-ఏ vs యూఎస్‌ఏ
కెనడా vs ఇటలీ
ఫిబ్రవరి 3
శ్రీలంక-ఏ vs ఒమన్
నెదర్లాండ్స్ vs జింబాబ్వే
నేపాల్ vs యూఏఈ
ఫిబ్రవరి 4
నమీబియా vs స్కాట్లాండ్
అఫ్గనిస్థాన్ vs వెస్టిండీస్
ఐర్లాండ్ vs పాకిస్థాన్
భారత్ vs దక్షిణాఫ్రికా (డీవై పాటిల్ గ్రౌండ్, నవీ ముంబై, రాత్రి 7 గంటలకు)
ఫిబ్రవరి 5
ఒమన్ vs జింబాబ్వే
కెనడా vs నేపాల్
ఆస్ట్రేలియా vsనెదర్లాండ్స్
న్యూజిలాండ్ vs యూఎస్‌ఏ
ఫిబ్రవరి 6
ఇటలీ vs యూఎస్‌ఏ
భారత్-ఏ vs నమీబియా
ఈ మ్యాచ్‌ల తర్వాత ఫిబ్రవరి 7 నుంచి ప్రపంచకప్ మెయిన్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ప్రారంభ మ్యాచ్ కొలొంబో వేదికగా పాకిస్తాన్, న్యూజిలాండ్ తలపడతాయి. అలానే భారత్ తమ తొలి మ్యాచ్‌ను అదే రోజు యూఎస్‌ఏతో ముంబైలో ఆడనుంది.
ఇవి కూడా చదవండి:
'అతను నిస్వార్థపరుడు'.. అభిషేక్ శర్మపై మంజ్రేకర్ ప్రశంసలు..
బంగ్లాను పాక్ రెచ్చగొడుతోంది: బీసీసీఐ ఉపాధ్యక్షుడు