Home » TDP
పేపర్‌మిల్లు నుంచి పెనాల్టీలు, పన్నులు ఎలా వసూలో చేయాలో సంబంధిత మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు బాగా తెలుసునని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
టీడీపీ శ్రేణుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఆ పార్టీ నాయకత్వం తొలిసారిగా ‘లీడర్‌షిప్ కాంక్లేవ్’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. సోమ, మంగళవారాల్లో రెండ్రోజులు జరిగే ఈ కార్యక్రమాన్ని శిక్షణ, సంభాషణ విధానంలో నిర్వహిస్తారు.
రాయలసీమను మొదలుకొని ఉత్తరాంధ్ర వరకు ఆర్థిక, సామాజిక పరంగా ఏపీని అగ్రభాగాన నిలిపేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు.
‘ఇంటింటికీ తెలుగుదేశం 2026’ కార్యక్రమాన్ని కోటికిపైగా ఇళ్లకు పార్టీ శ్రేణులు తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
తెలుగుదేశం మంత్రులతో మంత్రి నారా లోకేశ్ బ్రేక్‌ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. కొత్త పింఛన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్ నెల నుంచి దశల వారీగా కొత్త ఫించన్లు ఇవ్వాలని మంత్రి లోకేశ్ అన్నారు.
రాష్ట్రంలో గొడ్డలి పార్టీకి ఓటమి భయం పట్టుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘‘ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో కూటమి విజయం తథ్యమని సర్వే సంస్థలు నివేదికలిస్తున్నాయి.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టింది అక్షర సత్యమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ఉమ్మడి మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ ఆర్థిక సాయంతో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
పీఆర్ మోహన్‌కు ఎన్టీ రామారావు దగ్గరుండి పెళ్లి జరిపించగా.. 31 ఏళ్ల తర్వాత చంద్రబాబు సమక్షంలో మోహన్ కుమార్తె వివాహం జరిగింది. శ్రీకాళహస్తికి చెందిన శాప్ మాజీ చైర్మన్, దివంగత పీఆర్ మోహన్ కుమార్తె వివాహానికి ఆదివారం సీఎం చంద్రబాబు హాజరవడంతో పలువురు నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగడం గొడ్డలి పార్టీ అధినేతకు ఇష్టం లేదని, అందుకే వాటిని అడ్డుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు.