B.Tech Ravi: ఇరిగేషన్‌పై ఒక్క శాతం కూడా జ్ఞానం లేని అజ్ఞాని జగన్: బీటెక్ రవి
ABN , Publish Date - Jan 09 , 2026 | 01:31 PM
మాజీ సీఎం జగన్‌పై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కమీషన్ల కోసమే జగన్ ప్రాజెక్టుల డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు..
అమరావతి, జనవరి 9: వైసీపీపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి (Former MLC BTech Ravi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ లిప్ట్‌కు 2021లో స్టే ఇస్తే... ఇన్నేళ్లు నిద్రపోయి ఇప్పుడు వైసీపీ గగ్గోలు పెడుతోందని మండిపడ్డారు. కమీషన్ల కోసమే రాయలసీమ లిఫ్ట్ పనులు చేపట్టి, బిల్లులు చెల్లించుకున్నారని.. వేస్ట్ ప్రాజెక్టు అని తెలిసి కూడా నిర్మాణం చేపట్టి డబ్బులు దండుకున్న చరిత్ర జగన్‌ది అంటూ విరుచుకుపడ్డారు. పులివెందులలో మైక్రో ఇరిగేషన్‌కు రూ.1,200 కోట్లతో టెండర్ పిలిస్తే.. జగన్ రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కమీషన్ల కోసమే జగన్ ప్రాజెక్టుల డ్రామాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు.
పులివెందులకు చంద్రబాబు వల్లే నీళ్లు వచ్చాయన్నారు రవి. అవుకు పనులను పూర్తి చేసి పులివెందులకు నీళ్లు ఇచ్చింది చంద్రబాబు అని మాజీ ఎమ్మెల్సీ వెల్లడించారు. 1978 నుంచి ఎమ్మెల్యేగా ఉండి వైఎస్ కుటుంబం పులివెందులకు తాగునీటిని ఇవ్వలేదని విమర్శించారు. రూ.175 కోట్లతో పులివెందులలోని ప్రతి గ్రామానికీ.. తాగునీరు ఇచ్చే పథకం పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. ఎర్రవల్లి చెరువును నింపింది చంద్రబాబు ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఇరిగేషన్‌పై ఒక్క శాతం జ్ఞానం కూడా లేని అజ్ఞాని జగన్ అంటూ బీటెక్ రవి ఫైర్ అయ్యారు.
రాయలసీమ ప్రాజెక్టులు చేపట్టిందే ఎన్టీఆర్, చంద్రబాబు అని బీటెక్ రవి తెలిపారు. ఆర్టీపీపీ తెచ్చింది టీడీపీ ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. కడపలో గడిచిన ఐదేళ్లలో జగన్ స్టీల్ ప్లాంట్ కట్టలేదని విమర్శించారు. తాము స్టీల్ ప్లాంట్ కట్టి చూపిస్తామని సవాల్ చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ పూర్తి చేశామన్నారు. రాయలసీమ లిఫ్ట్‌పై ఎలాంటి అవగాహన లేని వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి అని విమర్శించారు. జగన్ అసెంబ్లీకి వస్తే రాయలసీమ లిఫ్ట్‌పై సమాధానం చెబుతామని బీటెక్ రవి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వైసీపీ శ్రేణుల నీచ బుద్ధికి నిదర్శనం.. శ్రీవారి చెంత ఇంతటి పాపమా..
అలాస్కా ట్రిప్.. మైనస్ 40 డిగ్రీల చలి.. తెలుగు విద్యార్థి అదృశ్యం
Read Latest AP News And Telugu News