Share News

AP News: వైసీపీ శ్రేణుల నీచ బుద్ధికి నిదర్శనం.. శ్రీవారి చెంత ఇంతటి పాపమా..

ABN , Publish Date - Jan 09 , 2026 | 02:37 PM

అధికారం పోయిందనే అక్కసు.. కూటమి ప్రభుత్వానికి ప్రజాదరణ పెరుగుతుందనే కడుపుమంట.. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందనే అసూయ.. వెరసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇరుకున పెట్టాలని తొలినాళ్ల నుంచి కుట్రలు కుతంత్రాలు వైసీపీ నాయకులు.

AP News: వైసీపీ శ్రేణుల నీచ బుద్ధికి నిదర్శనం.. శ్రీవారి చెంత ఇంతటి పాపమా..
Tirumala liquor bottles case

అమరావతి, జనవరి 9: అధికారం పోయిందనే అక్కసు.. కూటమి ప్రభుత్వానికి ప్రజాదరణ పెరుగుతుందనే కడుపుమంట.. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందనే అసూయ.. వెరసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇరుకున పెట్టాలని తొలినాళ్ల నుంచి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు, ఆ పార్టీ మద్దతుదారులు. సభలు సమావేశాలు పెట్టడం.. ఘర్షణలు సృష్టించి రచ్చ చేయడం.. వాటిని ప్రభుత్వంపై నెట్టడం.. శవ రాజకీయాలు చేయడం.. తప్పుడు ఆరోపణలు చేయడం.. ఇలా ఒకటేంటి.. వారి అబద్ధపు అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు నడుస్తోంది వైసీపీ నాయకులది.


ఆఖరికి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి నివాసమైన తిరుమలను కూడా తమ రాజకీయాలకు వాడుకునే దుష్ట ప్రయత్నం చేశారు. తిరుమల విషయంలో ఇప్పటికే ఎన్నో అపచారాలు చేసిన వైసీపీ ముఠా.. సిగ్గు, ఎగ్గు లేకుండా మరిన్ని దుర్మార్గాలకు తెగబడుతోంది. తాజాగా శ్రీవారి సన్నిధిలో అపచారం చేసి.. దానిని రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టే కుటిల ప్రయత్నానికి ఒడిగట్టారు వైసీపీ శ్రేణులు. ఖాళీ మద్యం సీసాలు తిరుమలలో పడేసి.. అపచారం అపచారం అంటూ నంగనాచి బొంకులు బొంకారు. కానీ, వారి కుట్రలు, కుతంత్రాలు శ్రీనివాసుడిని ఇలాకాలో ఇసుమంతైనా పని చేయలేదు. అసలు ఆ సీసాలు తెచ్చిందే వారని.. టీటీడీ, కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేసే దుర్భుద్ధితోనే ఇలాంటి నీచానికి తెగబడ్డారని తేలింది. మద్యం సీసాలు తీసుకువచ్చి తిరుమలలో వేసింది, వీడియో తీసి వైరల్ చేసింది వైసీపీ సానుభూతిపరులు, జగన్ మీడియా ప్రతినిధులేనని బహిర్గతమైంది. మరి అసలు మ్యాటర్ తేలాక.. పోలీసులు ఊరుకుంటారా.. ఈ వ్యవహారంలో సూత్రాధారులు, పాత్రధారులైన వైసీపీ కార్యకర్త ఆళ్లపాక కోటి, జగన్‌ మీడియా స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ మోహన్‌ కృష్ణపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.

Sakshi-Photo.jpg


అసలేం జరిగిందంటే..

ఖాళీ మద్యం బాటిళ్లను తీసుకువచ్చి తిరమలలోని కౌస్తుభం అతిథి గృహం సమీపంలో పడేశారు. ఆ సీసాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేశారు. దీంతో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులకు చెందిన గెస్ట్‌హౌస్ వద్దే ఈ సీసాలు కనిపించడంతో.. ఈ వ్యవహారాన్ని పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. దీని వెనకున్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరా? అని ఆరా తీశారు. టీటీడీతోపాటు పోలీసు శాఖ ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతో కొందరు వైసీపీ కార్యకర్తలు, జగన్‌ మీడియా ప్రతినిధులు కుట్రకు పాల్పడినట్లు నిర్ధారించారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పక్కా ఆధారాలతో నిందితులను గుర్తించారు. తిరుపతికి చెందిన వైసీపీ కార్యకర్త ఆళ్లపాక కోటి, మరికొంతమంది కలిసి ఈ పని చేసినట్లు నిర్ధారించారు.

Sakshi-Photo-2.jpg


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరు తిరుపతి నుంచి ఖాళీ మద్యం సీసాలను తీసుకువచ్చి.. తిరుమలలోని కౌస్తుభం గెస్ట్‌హౌస్ ప్రహరీ వద్ద పొదల్లో పడేశారు. ఆ తరువాత వైసీపీ సోషల్ మీడియా విభాగం కార్యకర్త నవీన్‌కు సమాచారం అందించారు. నవీన్.. సాక్షి మీడియా స్టాప్ ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణకు చెప్పాడు. అతను.. సాక్షి రిపోర్టర్‌ ప్రసాద్‌, సాక్షి టీవీ వీడియో జర్నలిస్ట్‌ ముఖేష్‌, సాక్షి ఫొటోగ్రాఫర్‌ గిరికి సమాచారం ఇచ్చి మద్యం సీసాల వీడియోలు, ఫొటోలు తీయించాడు. వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేయించాడు. ఆపై తమకేమీ తెలియదన్నట్లుగా తిరుమలలో అపచారం.. అరాచకం అంటూ టీటీడీపై, రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం మొదలుపెట్టారు. వీరి కుతంత్రాన్నంతా పోలీసులు తమ ఎంక్వైరీలో తేల్చారు. దీనికి సంబంధించి కోటి, నవీన్‌, మోహన్‌కృష్ణపై కేసు నమోదైంది. కోటి, మోహన్‌ కృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న నవీన్‌ కోసం గాలిస్తున్నారు.

Tirumala-Issue.jpg


భుజం తడుముకుంటున్న భూమన..

గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజం తడుముకున్నట్లుగా.. అసలు కుట్రలు దారులు ఎవరో తెలిశాక కూడా తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు. మద్యం బాటిళ్ల వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్ రెడ్డి.. తప్పుడు కేసులు, తప్పుడు ప్రచారం అంటూ కవరింగ్ ఇస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్‌తో సహా దొరికిపోయాక కూడా.. టీటీడీ, పోలీస్ డిపార్ట్‌మెంట్‌, రాష్ట్ర ప్రభుత్వానిదే తప్పు అంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు.


Also Read:

బిగ్ అప్‌డేట్.. రేట్లు పెరిగాయ్..

జగన్ శైలి పైన మృదుత్వం.. లోన కర్కషత్వం: మంత్రి ఆనం

ఫేక్ ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోకు పవన్‌ స్ట్రాంగ్ వార్నింగ్

Updated Date - Jan 09 , 2026 | 04:42 PM