Anam Slams Jagan: జగన్ శైలి పైన మృదుత్వం.. లోన కర్కశత్వం: మంత్రి ఆనం
ABN , Publish Date - Jan 09 , 2026 | 01:46 PM
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుపై రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన శైలి రెండు విధాలుగా ఉంటుందని ధ్వజమెత్తారు.
అమరావతి, జనవరి 09: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మరోసారి మండిపడ్డారు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి(Cabinet Minister Anam Ramanarayana Reddy). జగన్ శైలి పైనేమో మృదుత్వంగా.. లోపల మాత్రం కర్కశత్వంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రజలు జగన్ను తిరస్కరిస్తే దానికి ప్రజలే తప్పుచేశారనడం ఆయన అవివేకానికి నిదర్శనమని ఆనం అన్నారు.
'గంజాయి బ్యాచ్‌ను ప్రోత్సహించి జగన్ యువశక్తిని నిర్వీర్యం చేశారు. తన ఉనికిని కాపాడుకునేందుకు రాష్ట్రానికి అంతా మంచే చేశానంటున్నాడు. కుప్పంలోని హంద్రీ-నీవా కాలువలో ఆర్టిఫీషియల్ నీరు పారించిన ఘనుడు జగన్. తన హయాంలో అమాయకులను వాడుకుని వారి జీవితాలను నాశనం చేశాడు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొస్తుంటే.. వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. విధ్వంసం చేయడం, అరాచకాలు సృష్టించడం వైసీపీ సిద్ధాంతం. ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీరివ్వాలనే తపన, తాపత్రయం చంద్రబాబు ప్రభుత్వానిది' అని ఆనం చెప్పుకొచ్చారు.
రాష్ట్రం.. జగన్ హయాంలో కరవు కాటకాలతో ఉంటే, చంద్రబాబు హయాంలో సస్యశ్యామలంగా ఉంటుందని వైసీపీ పాలనాతీరుపై దుమ్మెత్తిపోశారు మంత్రి ఆనం. ఐదేళ్లపాటు కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లకే జగన్ కాలం వెళ్లదీశారని మండిపడ్డారు. రాజధాని అమరావతిని నీరుగార్చినందుకు ఆ గ్రామాల ప్రజలు ఇప్పటికీ జగన్ను ఛీకొడుతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: