Share News

Ananthapuram News: వైసీపీ నాయకుడి కంకర మిషన్‌ మూసివేత

ABN , Publish Date - Jan 09 , 2026 | 11:50 AM

అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి కంకర మిషన్‌ను అధికారులు మూసివేశారు. నిబంధనలు పాటించడం లేదనే కారణంలో మిల్లును మూసివేసినట్లు అధికారులు పేర్కొంటున్నా... అసలు కారణాలు వేరే ఉన్నాయనే విమర్శలొస్తున్నాయి. వివరాలిలా ఉన్నాయి.

Ananthapuram News: వైసీపీ నాయకుడి కంకర మిషన్‌ మూసివేత

కదిరి(అనంతపురం): మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుళ్ల సమీపంలో ఉన్న వైసీపీ నాయకుడు ప్రణీత్‌రెడ్డి(Praneeth Reddy)కి చెందిన శివసాయి కంకర మిషన్‌ (స్టోన్‌ క్రషర్‌ ఫ్యాక్టరీ)ను మూసివేస్తూ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఫ్యాక్టరీకి విద్యుత్‌ సరఫరాను కూడా నిలిపివేయాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించింది. కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టలేదని 2024 జనవరి 26న ఈ ఫ్యాక్టరీని కాలుష్యనియంత్రణ మండలి మూసి వేసింది.


దీనిపై యజమాన్యం హైకోర్టుకు వెళ్లి మూసివేతను ఆపింది. గత ఏడాది జూలై 28న విజిలెన్స్‌, ఎన్‌ఫోర్సుమెంట్‌ సంయుక్తంగా ఫ్యాక్టరీని తనిఖీచేశారు. కాలుష్య నియంత్రణ చర్యలు పూర్తిగా చేయలేదని ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా కంకర ప్యాక్టరీని తక్షణం మూసివేయాలని ఉత్తర్వులిచ్చింది.


pandu4.jpg

ఒకవేళ డిజిల్‌ జనరేటర్‌తో కానీ, ఇతర యంత్రాలసాయంతోకానీ, ఫ్యాక్టరీలో పనులుచేస్తే, ఒకటిన్నర సంవత్సరం నుంచి గరిష్ఠంగా ఆరేళ్ల జైలు, జరిమానా ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శివసాయి కంకర మిషన్‌కు గురువారం నుంచి విద్యుత్‌ సరఫరా నిలిపివేసినట్లు ట్రాన్స్‌కో డీఈ రామకృష్ణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు కరెంటు తొలగించామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ఇక షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్‌

శాప్‌కు 60.76 కోట్లు.. కేంద్ర క్రీడా శాఖ కేటాయింపు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 09 , 2026 | 12:19 PM