Share News

Aadhaar Updates: బిగ్ అప్‌డేట్.. రేట్లు పెరిగాయ్..

ABN , Publish Date - Jan 09 , 2026 | 02:08 PM

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) మరో బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఆధార్ పీవీసీ కార్డు రేటును పెంచేసింది. ఆధార్ పీవీసీ కార్డుకు ప్రస్తుతం 50 రూపాయలు ఉండగా.. దానిని రూ.75 వరకు పెంచింది.

Aadhaar Updates: బిగ్ అప్‌డేట్.. రేట్లు పెరిగాయ్..
UIDAI

న్యూఢిల్లీ, జనవరి 9: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) మరో బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఆధార్ పీవీసీ కార్డు రేటును పెంచేసింది. ఆధార్ పీవీసీ కార్డుకు ప్రస్తుతం 50 రూపాయలు ఉండగా.. దానిని రూ.75 వరకు పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన రేట్లు జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, పెంచిన రేట్లలో జీఎస్టీ, డెలివరీ ఛార్జీలు కూడా కలిపే ఉంటాయని స్పష్టం చేసింది.


ఆధార్ కార్డును మొదట్లో ఒక పేపర్ మాదిరిగా ఇచ్చేవారు. దానికి ల్యామినేషన్ చేసేవారు. ఆ తరువాత ఆధార్‌ మరింత స్ట్రాంగ్‌గా, నాణ్యమైనదిగా ఉండేందుకు పీవీసీగా మార్చారు. పీవీసీ కార్డు అయితే ఎవరైనా సరే సులభంగా తమ వెంట తీసుకెళ్లడానికి వీలుగా ఉంటుంది. దీంతో ప్రతి ఒక్కరూ పీవీసీ కార్డు చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.


UIDAI అధికారుల ప్రకారం.. 2020లో పీవీసీ కార్డులను తీసుకువచ్చినప్పటి నుంచి మొదటిసారి ఛార్జీలను పెంచారు. ఆధార్ PVC కార్డ్ ఉత్పత్తి కోసం ఉపయోగించే మెటీరియల్, ముద్రణా ఖర్చులు, భద్రతా పంపిణీ, లాజిస్టిక్స్ వంటి కార్యకలాపాలకు సంబంధించిన వ్యయాలు భారీగా పెరిగాయని.. దీని కారణంగా రేట్లు పెంచాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. వినియోగదారులు myAadhaar వెబ్‌సైట్ లేదా mAadhaar మొబైల్ యాప్ ద్వారా PVC కార్డ్‌ కోసం ఆర్డర్ చేయొచ్చని తెలిపారు.


Also Read:

దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లండి..

జగన్ శైలి పైన మృదుత్వం.. లోన కర్కషత్వం: మంత్రి ఆనం

ఫేక్ ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోకు పవన్‌ స్ట్రాంగ్ వార్నింగ్

Updated Date - Jan 09 , 2026 | 04:37 PM