MP Appalanaidu: మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పోటీపై ఎంపీ అప్పలనాయుడు సమాధానమిదే..
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:10 PM
తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పోటీకి సంబంధించి విజయనగరం ఎంపీ అప్పలనాయుడు క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్/అమరావతి, జనవరి 19: ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడిస్తామని విజయనగరం ఎంపీ అప్పలనాయుడు(Vizianagaram MP Appalanaidu) స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వార్డ్ మెంబర్ నుంచి కార్పొరేషన్ వరకు కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (Former CM YS Jagan Reddy) ఐదేళ్లలో చేయలేని అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu) 16 నెలల్లో చేసి చూపించారని అన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలు చంద్రబాబుకు రెండు కళ్లు అని ఎంపీ అన్నారు. తెలంగాణలోనూ తెలుగుదేశం పార్టీకి మంచి ఆదరణ ఉందని చెప్పారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీచేసే అంశంపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని అప్పలనాయుడు వెల్లడించారు. బీఆర్ఎస్, వైసీపీ కుమ్మక్కై సీఎం చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నదీ జలాలపై బురద రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ కోర్ట్‌కు హాజరైతే బీఆర్ఎస్ వాళ్లు ఫ్లెక్సీలు పెట్టి స్వాగతం చెబుతున్నారని.. కేటీఆర్ ఖమ్మం వెళ్తే వైసీపీ నేతలు ఫ్లెక్సీలు పెడతారంటూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ, బీఆర్ఎస్.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరికాదని ఎంపీ అన్నారు.
మాజీ సీఎం జగన్ బెంగళూరులో కూర్చుని కుట్రలు చేస్తున్నారని విజయనగరం ఎంపీ ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు కూడా బెంగళూరు ప్యాలెస్ నుంచే కుట్రలో భాగమవుతున్నారని విమర్శించారు. జగన్ ఐదేళ్లు సీఎంగా ఉండి రాయలసీమకు ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా అని ప్రశ్నించారు. జగన్, బీఆర్‌ఎస్ నాయకులు సొంత వ్యాపారం కోసం కాకుండా అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారైనా ప్రజల సమస్యలపై చర్చించారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు పార్టీల నాయకులు టీడీపీపై అసూయపడుతున్నారని అప్పలనాయుడు అన్నారు.
ఇవి కూడా చదవండి...
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు.. బీజేపీ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో కీలక పరిణామం
న్యూఢిల్లీలో బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు..
Read Latest Telangana News And AP News And Telugu News