Home » TDP
ఉత్తరాంధ్రలో వైసీపీకి భారీ షాక్.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మంగళవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు.
మూడేళ్లలో రూ.35వేల కోట్లతో రాష్ట్రంలోని 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి చరిత్ర సృష్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్ రెండో రోజున ఆయన మాట్లాడారు.
కదులుతున్న కారు బ్యానెట్‌పై వ్యక్తి పడినా ఆపకుండా, దూసుకెళ్లిన వైనం చిత్తూరు జిల్లా కుప్పంలో కలకలం రేపింది. మూడు కిలో మీటర్ల మేర వెళ్లాకగానీ కారు ఆగింది కాదు. ఈ వ్యవహారంలో వైసీపీ జడ్పీ చైర్మన్ శ్రీనివాసులుపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
పార్టీ, పర్సనల్, ప్రభుత్వం....అనే మూడు ‘పీ’లను అంతా పాటించాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ కోరారు. కార్యకర్తల పోరాటం, త్యాగాల వల్లే అధికారంలోకి వచ్చామన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతల్ని గుర్తించి అధిగమించాలని తెలిపారు. టీడీపీ కాంక్లేవ్ ముగింపు సభలో లోకేశ్ మాట్లాడారు.
‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపు మనదే కావాలి. కొందరు దింపుడు కళ్లెం ఆశతో ‘సర్’, రిజర్వేషన్లపై కోర్టులకు వెళ్లారు. వారి ఆశలు నిరాశ కావాలి’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్ రెండో రోజున ఆయన మాట్లాడారు.
అభివృద్ధిపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరిగేలా వారి వద్దకు తీసుకెళ్లాలని తెలుగు దేశం పార్టీ శ్రేణులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విమర్శలను కూడా సానుకూలంగా మార్చుకుని ప్రజల మద్దతు కూడగట్టాలన్నారు.
ఎంపీలైనా.. ఎమ్మెల్యేలైనా ఎవరికైనా పార్టీయే సుప్రీమని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్ స్పష్టం చేశారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడారు. పార్టీ అధినేత చంద్రబాబు బీ-ఫారం ఇవ్వకుంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు కాలేరు.. మంత్రి పదవులు అనుభవించలేరని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని అన్నారు.
టీడీపీ కాంక్లేవ్‌లో ఐదు, అంతకన్నా ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా చేసిన వారు తమ అనుభవాలను పంచుకున్నారు. నాయకులకు స్థానిక, దేశ, ప్రపంచ రాజకీయాలపై అవగాహన ఉండాలని సూచించారు. ఐదేళ్లకు ఒకసారి మారే ప్రజల ఆలోచనలు, విధానాలకు అనుగుణంగా మారుతూ, వారికి దగ్గర కావాలని తెలిపారు. నాయకుడికి బ్యాక్ టీమ్ బలంగా ఉండటం చాలా ముఖ్యమంటూ తమ విజయ మంత్రం తెలియజేశారు.
నియోజకవర్గాల్లో చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. ఆర్థిక కష్టాలున్నా ప్రతి నియోజకవర్గానికీ కోటి రూపాయల చొప్పున అందిస్తామని ప్రకటించారు.
టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికలను తేలిగ్గా తీసుకోకుండా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.