Home » TDP
టీడీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో గురువారం ఏలూరులో జరగనున్నాయి. విశాఖలో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ హాజరు కానున్నారు.
ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి నారా లోకేశ్ కార్యకర్తలకు సూచించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.
కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంంలో వారు తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.
ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ శ్రేణులు భారీగా ఆ పార్టీకి రాజీనామా చేసి.. టీడీపీలో చేరాయి. ఆదివారం నందిగామలో స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారంతా టీడీపీలో చేరారు.
పార్టీలోకి ఎవరు రావాలన్నా.. స్థానిక నాయకత్వం అంగీకరిస్తేనే వారిని తీసుకుంటామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన చిన్న శ్రీనుని స్థానిక నాయకత్వం ఆమోదంతోనే పార్టీలోకి తీసుకున్నామని ఆయన వివరించారు.
స్థానిక సంస్థలు అంత ముఖ్యమైనవి కావని జగన్ భావించడం క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలనే దెబ్బతీసేలా ఉందంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. మెగా డీఎస్సీపై జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దమ్మూ ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు.
వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబ సభ్యులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, చంపుతామని బెదిరించారంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఆయన కోడలు మేఘన ఫిర్యాదు చేశారు. లోక్‌భవన్‌లో బుధవారం గవర్నర్‌ను కలిసి ఆమె వినతిపత్రం అందజేశారు.
‘నిజం గెలిచింది’ అంటూ టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబును గతంలో నిర్బంధించిన రోజులను గుర్తుచేసుకుంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులు చేతబట్టి నిరసన తెలిపారు.
ఉత్తరాంధ్రలో వైసీపీకి భారీ షాక్.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మంగళవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు.