Share News

ఎంపీ కేశినేని శివనాథ్‌పై అసత్య ప్రచారాలు.. ఒకరి అరెస్ట్

ABN , Publish Date - Jun 05 , 2026 | 04:18 PM

ఎంపీ కేశినేని శివనాథ్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎంపీపై సోషల్ మీడియాలో మాజీ ఎంపీ నాని, అతని అనుచరులు చేసిన దుష్ప్రచారంపై పోలీసులకు ఎంపీ చిన్ని కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు చేసింది.

ఎంపీ కేశినేని శివనాథ్‌పై అసత్య ప్రచారాలు.. ఒకరి అరెస్ట్
Vijayawada News

విజయవాడ, జూన్ 5: ఎంపీ కేశినేని శివనాథ్‌పై(చిన్ని) అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎంపీ కేశినేనిపై సోషల్ మీడియాలో మాజీ ఎంపీ నాని, అతని అనుచరులు చేసిన దుష్ప్రచారంపై పోలీసులకు ఎంపీ చిన్ని కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేసిన పటమట పోలీసులు.. తాతినేని రాంబాబుతో పాటు మరి కొంతమందిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ దామోదర్ మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


ఇప్పటికే డీజీపీ, సీపీ దీనిపై ప్రకటనలు చేశారని ఏసీపీ చెప్పారు. తాజాగా ఎంపీ కేశినేని శివనాథ్ పరువుకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనిపై విచారణ చేసి తాతినేని రాంబాబుతో పాటు కొంతమందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈరోజు తాతినేని రాంబాబును అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు చెప్పారు. ఇతర నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. అనవసరంగా అసత్యాలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఏసీపీ దామోదర్ వార్నింగ్ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

పర్యావరణాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు: మంత్రి కొల్లు రవీంద్ర

జూన్ 21న 25,000 మందితో యోగా: కలెక్టర్ లక్ష్మీ శా

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 05 , 2026 | 04:32 PM