మైత్రీవనం అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
ABN , Publish Date - Jun 05 , 2026 | 02:32 PM
హైదరాబాద్‌లోని మైత్రీవనం అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
హైదరాబాద్, జూన్ 5: మైత్రీవనం అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈరోజు(శుక్రవారం) పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హర్ష మెస్‌ను కూడా రంగనాథ్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మైత్రీవనం సమీపంలో ఉన్న కేఎస్ఆర్ భవనానికి అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలిస్తామన్నారు. నాలాను ఆక్రమించి భవనం కన్‌స్ట్రక్షన్ జరిగితే కచ్చితంగా కూలగొడతామని స్పష్టం చేశారు. కేఎస్‌ఆర్ భవనం షాప్స్ పక్కనే ఉన్న హర్ష డీలక్స్ మెస్‌ను కూడా పరిశీలించామన్నారు. అగ్నిప్రమాదంపై పోలీసుల విచారణ జరుగుతోందని తెలిపారు.
హర్ష మెస్ డీలక్స్‌లో స్పార్క్ వల్ల ప్రమాదం జరిగిందా?.. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలుతుందని రంగనాథ్ వెల్లడించారు. నాంపల్లి బిల్డింగ్ అగ్నిప్రమాదం అనంతరం ఎన్ఓసీలు జారీ చేశామన్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. అగ్నిప్రమాదం జరిగిన భవనానికి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్లు ఒకే వైపు ఉన్నాయన్నారు. బిల్డింగ్‌కు ఫైర్ సేఫ్టీ నిబంధనలు లేవని తెలిపారు. హర్ష మెస్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని బాధితులు చెప్తున్నారని.. ప్రమాదానికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతాయని రంగనాథ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో చోరీ కేసు.. పోలీసుల అదుపులో నేపాలీ గ్యాంగ్
తెలంగాణ అభివృద్ధికి ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ అవసరం: రాంచందర్‌రావు
Read Latest Telangana News And Telugu News