తెలంగాణ అభివృద్ధికి ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ అవసరం: రాంచందర్‌రావు
ABN , Publish Date - Jun 05 , 2026 | 01:20 PM
బీఆర్‌ఎస్ పాలనలో నిధులు, నియామకాలు, సాగునీటి వ్యవస్థల్లో వైఫల్యాలు జరిగాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. అవినీతి, నిర్లక్ష్యంతో పాలన సాగిస్తోందని వ్యాఖ్యానించారు.
మహబూబాబాద్, జూన్ 5: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో రాంచందర్‌రావు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పాలనలో నిధులు, నియామకాలు, సాగునీటి వ్యవస్థల్లో వైఫల్యాలు జరిగాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. అవినీతి, నిర్లక్ష్యంతో పాలన సాగిస్తోందని వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ హామీ పూర్తిగా అమలు కాలేదని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ అవసరమని వెల్లడించారు.
2014 తర్వాత దేశంలో సంక్షేమం, అభివృద్ధి సమన్వయంతో ముందుకు సాగుతోందని రాంచందర్‌రావు అన్నారు. బీజేపీ కార్యకర్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. సాంకేతికతతో పాటు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కొనసాగించాలన్నారు. శిక్షణా తరగతుల్లో చర్చించిన 12 అంశాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బీజేపీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయాలని నేతలకు రాంచందర్‌రావు సూచించారు.
ఇవి కూడా చదవండి..
మైత్రీవనం అగ్నిప్రమాద ఘటన.. మరోసారి ఆధారాలు సేకరించనున్న క్లూస్ టీమ్
రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో చోరీ కేసు.. పోలీసుల అదుపులో నేపాలీ గ్యాంగ్
Read Latest Telangana News And Telugu News