Share News

మైత్రీవనం అగ్నిప్రమాద ఘటన.. మరోసారి ఆధారాలు సేకరించనున్న క్లూస్ టీమ్

ABN , Publish Date - Jun 05 , 2026 | 10:40 AM

హైదరాబాద్‌లోని మైత్రీవనం కేఎస్‌ఆర్ ఫ్యాషన్స్ బిల్డింగ్ అగ్నిప్రమాద ఘటనలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. అగ్నిప్రమాద ఘటనపై ఫైర్ డిపార్ట్మెంట్, మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మైత్రీవనం అగ్నిప్రమాద ఘటన.. మరోసారి ఆధారాలు సేకరించనున్న క్లూస్ టీమ్
Hyderabad Fire Accident

హైదరాబాద్, జూన్ 5: మైత్రీవనం కేఎస్‌ఆర్ ఫ్యాషన్స్ బిల్డింగ్ అగ్నిప్రమాద ఘటనలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. అగ్నిప్రమాద ఘటనపై ఫైర్ డిపార్ట్మెంట్, మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణమా..? మానవ తప్పిదాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ప్రమాదానికి కారణమైన బిల్డింగ్‌కు అనుమతులు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు, ఇతర అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


మెట్రో నిర్మాణం తర్వాత బిల్డింగ్ ఏర్పాటు చేసినట్లు జీఎచ్ఎంసీ గుర్తించింది. మరోసారి నేడు(శుక్రవారం) ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించనుంది. ఈరోజు అమీర్‌పేట్‌లో ప్రమాదానికి గురైన షాపింగ్ కాంప్లెక్స్‌ను నిపుణుల బృందం పరిశీలించనుంది. ప్రమాదంలో కోటిన్నరకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. ప్రమాదంలో మొదటి, రెండో అంతస్తులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అగ్నికి ఆహుతైన మొదటి, రెండో ఫ్లోర్లలో 13 కాంప్లెక్స్‌లు ఉండగా.. అందులో హెల్మెట్లు, బొమ్మలు, బట్టల దుకాణాలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

హైదరాబాద్‏ను కాపాడుకుందాం..!

భవిష్యత్తులో వర్షాలు వచ్చే పరిస్థితి లేదు.. నీటిని ఆదా చేయండి: మంత్రి పొన్నం ప్రభాకర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 05 , 2026 | 11:00 AM